Zodiac Signs : ఫిబ్రవరి నెలలో రెండు అద్భుత యోగాలు… ఈ రాశులకు గజకేసరి యోగం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఫిబ్రవరి నెలలో రెండు అద్భుత యోగాలు… ఈ రాశులకు గజకేసరి యోగం…?

 Authored By ramu | The Telugu News | Updated on :30 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఫిబ్రవరి నెలలో రెండు అద్భుత యోగాలు... ఈ రాశులకు గజకేసరి యోగం...?

Zodiac Signs : 2025 వ సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 6,7, 8 తేదీల్లో బుధాదిత్య యోగం మరియు గజకేసరి యోగంలు ఏర్పడుతున్నాయి. ఈ రెండు యోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బృహస్పతి, చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల గజకేసరి యోగం, బుధుడు మరియు సూర్యుడు మకర రాశిలో కలుస్తుండడంతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం మూడు రోజులపాటు ఉంటుంది. బుధాదిత్య యోగం ఫిబ్రవరి నెల 27 వరకు ఉంటుంది. అయితే ఈ యోగం చేత ఆరు రాశుల వారికి ధనం కుంభవృష్టిగా రాబోతుంది. ఈ రాశి వారు ఏ పనులు చేసిన విజయం వీరి వెంటే. ఏరాశులకి ఈ రెండు యోగాల వలన కలిసి వస్తుందో తెలుసుకుందాం….

Zodiac Signs ఫిబ్రవరి నెలలో రెండు అద్భుత యోగాలు ఈ రాశులకు గజకేసరి యోగం

Zodiac Signs : ఫిబ్రవరి నెలలో రెండు అద్భుత యోగాలు… ఈ రాశులకు గజకేసరి యోగం…?

Zodiac Signs కన్యా రాశి

న్య రాశి వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి. లాటరీలు షేర్లు, స్టాక్ మార్కెట్లు వంటి సంబంధించిన వ్యాపారాలు ఇవి బాగా కలిసి వస్తాయి. తండ్రి నుంచి ఆస్తి వస్తుంది. దాకా కోర్టు కేసుల్లో ఇరుక్కుని పడుతున్న వారికి, అవన్నీ తొలగిపోతాయి. సొంత గృహం నిర్మించుకోవాలి అనే కోరిక నెరవేరుతుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

Zodiac Signs వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఉద్యోగంలో డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో లాభాలకు దారితీస్తుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పై స్థానానికి ఎదుగుతారు. ఆదాయం కూడా అభివృద్ధి చెందుతుంది.

Zodiac Signs మకర రాశి

ఈ మకర రాశి వారికి ఉద్యోగ వృత్తిలో డిమాండ్లు పెరుగుతుంది. వీరిదే పైచేది పై చేయిగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు హోదాలు కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, ఆర్థిక రంగాలకు సంబంధించిన వారికి విపరీతంగా ధనము వస్తుంది. సంపన్నుల కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించును.

మేషరాశి : మేష రాశి వారికి ఏ వ్యాపారాల్లోనూ, చేసే అభివృద్ధిలోనూ మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లో పెరుగుతాయి. మీరు చేసిన పనికి తగిన గుర్తింపు లభించును. మేష రాశి వారికి గజకేసరి యోగం కలగటం వల్ల భారీగా ఆదాయాలు పెరుగుతాయి. ఉద్యోగంలో వీరికి డిమాండ్ ఎక్కువే.

వృషభ రాశి : పూర్వీకుల ఆస్తులు,లేదా తండ్రి వైపు నుంచి ఆస్తి వస్తాయి. వాటితో పాటు విపరీతమైన ధనం కూడా వస్తుంది. ఈ వృషభ రాశి వారు ఏ పని చేసినా అన్నింటా విజయమే. ఈ వృషభ రాశి వారు విజయాలను అందుకుంటారు, లావాదేవీలను చూస్తారు. ఈ వృషభ రాశి వారికి బుధాదిత్య యోగం కలుగుతుంది తద్వారా ఈ రాశి వారికి కుంభవృష్టిగా ధనము వస్తుంది.

కర్కాటక రాశి : ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటారు. చేసే వృత్తిలోనూ వ్యాపారాల్లోనూ లాభాదేవిలతోటి ముందుకు వెళ్తారు. వ్యాపారాలు కలిసిరాటం వల్ల సంపన్నులవుతారు. దేశాలకి వెళ్లే అవకాశం ఉంది. విదేశాలలో విపరీతంగా సంపాదిస్తారు. బాగా ఉన్నవారి ఇంటి నుంచి పెళ్లి సంబంధం వస్తుంది. మీరు చేసే ఉద్యోగంలో రాజయోగం ఉంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది