ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా అందరూ ప్రతీ రోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అలవాటు పడిపోయారు. ఇడ్లోనో, దోశానో లేదా మైసూర్ బజ్జీనో లేదా ఇంకేదైనా టిఫిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే, ప్రతీ రోజు ఇంట్లో టిఫిన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి జనాలు బయట టిఫిన్ సెంటర్స్ వద్ద చేస్తుంటారు. అయితే, ఈ టిఫిన్స్ ధరలు కాస్ట్లీ హోటల్స్‌లో అయితే బాగా ఉంటాయి. ఒక ప్లేట్ టిఫిన్‌కే దాదాపుగా రూ.వంద వరకు ఉండొచ్చు. ఇక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అయితే రూ.25 లేదా 30 ఉంటుంది. కానీ, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ కేవలం ఒక రూపాయికే అందిస్తున్నారు.
వన్ రూపీకే మూడు చట్నీలతో కూడి ప్లేట్ ఇడ్లీ లేదా మైసూర్ బజ్జీ ఇస్తున్నారు నిర్వాహకులు. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డుకు సమీపంలోని కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్‌బీ కొత్తూరు గ్రామం ఉంటుంది. మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ, రాణి దంపతులు ఇలా ఒక్క రూపాయికే టిఫిన్స్ ఇస్తుంటారు. రామకృష్ణను స్థానికంగా రాంబాబు అని పిలుస్తుంటారు. ఆయన తన భార్యతో కలిసి ఇలా ఒక్క రూపాయికే టిఫిన్స్ అందిస్తుండగా, ప్రతీ రోజు తన హోటల్‌కు కనీసంగా ఐదొందల మంది వస్తారని రాంబాబు చెప్తున్నాడు. తక్కువ ధరకే టిఫిన్స్ అందించడం పట్ల తనకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు నిర్వాహకుడు రాంబాబు.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.