చదివిన చదువుకు గుర్తింపుగా బోర్డు నుంచి వచ్చే సర్టిఫికెట్ అనేది చాలా ముఖ్యం. ఆ సర్టిఫికెట్ చూపించడం ద్వారానే ఎవరైనా తాము చదివిన చదువుకు గుర్తింపు పొందుతారు. అయితే, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్, ఆ తర్వాత కొంత కాలం పాటు విద్యాసంస్థలు అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. ఇటీవలే కొన్ని విద్యాసంస్థలు ఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలోనే విద్యాసంస్థలకు విద్యార్థులు వస్తున్నారు. కాగా, అలా విద్యాసంస్థ నుంచి తాను చదివినట్లు ధ్రువపత్రం తెచ్చుకునేందుకు వెళ్లి విగతజీవిగా మారాడు ఓ స్టూడెంట్. వివరాల్లోకెళితే.. అనంతరపురం జిల్లా కదిరిలో ఈ విషాద ఘటన జరిగింది.
కదిరికి చెందిన స్టూడెంట్ బాబ్జాన్ తాను చదివిని బీ ఫార్మసీ కాలేజ్ నుంచి బీ ఫార్మసీ సర్టిఫికెట్ కోసం కారులో బయల్దేరాడు. మార్గం మధ్య కదిరి-పులివెందుల మధ్య ఒదులపల్లి వంకలో కారు భారీ వర్షానికి వచ్చిన వరదలో కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థి బాబ్జాన్, డ్రైవర్ రఫీ గల్లంతయ్యారు. ఈ క్రమంలోనే బాబ్జాన్ మృతదేహం లభ్యం కాగా, రఫీ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక వరద నేపథ్యంలో కదిరి-పులివెందుల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. తమ తనయుడు సర్టిఫికెట్ తీసుకుని ఆనందంగా వస్తాడని ఊహించుకుంటున్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసుకుని శోకసంద్రంలోకి వెళ్లిపోయారు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి ఆసరా అయ్యే సమయంలో కుమారుడు మరణించడం ద్వారా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.