రూపాయికే మూడు చట్నీలతో కూడిన టిఫిన్.. ఎక్కడంటే? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

రూపాయికే మూడు చట్నీలతో కూడిన టిఫిన్.. ఎక్కడంటే?

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా అందరూ ప్రతీ రోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అలవాటు పడిపోయారు. ఇడ్లోనో, దోశానో లేదా మైసూర్ బజ్జీనో లేదా ఇంకేదైనా టిఫిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే, ప్రతీ రోజు ఇంట్లో టిఫిన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి జనాలు బయట టిఫిన్ సెంటర్స్ వద్ద చేస్తుంటారు. అయితే, ఈ టిఫిన్స్ ధరలు కాస్ట్లీ హోటల్స్‌లో అయితే బాగా ఉంటాయి. ఒక ప్లేట్ టిఫిన్‌కే దాదాపుగా రూ.వంద వరకు ఉండొచ్చు. ఇక రోడ్ సైడ్ టిఫిన్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :3 September 2021,1:49 pm

ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపుగా అందరూ ప్రతీ రోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి అలవాటు పడిపోయారు. ఇడ్లోనో, దోశానో లేదా మైసూర్ బజ్జీనో లేదా ఇంకేదైనా టిఫిన్‌గా తీసుకోవాలనుకుంటున్నారు. అయితే, ప్రతీ రోజు ఇంట్లో టిఫిన్ చేయడం సాధ్యం కాదు కాబట్టి జనాలు బయట టిఫిన్ సెంటర్స్ వద్ద చేస్తుంటారు. అయితే, ఈ టిఫిన్స్ ధరలు కాస్ట్లీ హోటల్స్‌లో అయితే బాగా ఉంటాయి. ఒక ప్లేట్ టిఫిన్‌కే దాదాపుగా రూ.వంద వరకు ఉండొచ్చు. ఇక రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ అయితే రూ.25 లేదా 30 ఉంటుంది. కానీ, ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆ టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ కేవలం ఒక రూపాయికే అందిస్తున్నారు.

 

వన్ రూపీకే మూడు చట్నీలతో కూడి ప్లేట్ ఇడ్లీ లేదా మైసూర్ బజ్జీ ఇస్తున్నారు నిర్వాహకులు. రాజమహేంద్రవరం–కాకినాడ ఏడీబీ రోడ్డుకు సమీపంలోని కొత్తూరు జంక్షన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళితే ఆర్‌బీ కొత్తూరు గ్రామం ఉంటుంది. మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ, రాణి దంపతులు ఇలా ఒక్క రూపాయికే టిఫిన్స్ ఇస్తుంటారు. రామకృష్ణను స్థానికంగా రాంబాబు అని పిలుస్తుంటారు. ఆయన తన భార్యతో కలిసి ఇలా ఒక్క రూపాయికే టిఫిన్స్ అందిస్తుండగా, ప్రతీ రోజు తన హోటల్‌కు కనీసంగా ఐదొందల మంది వస్తారని రాంబాబు చెప్తున్నాడు. తక్కువ ధరకే టిఫిన్స్ అందించడం పట్ల తనకు ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు నిర్వాహకుడు రాంబాబు.

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది