Indian Movie Tickets : 2024లో అత్యధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?
2024 Rewind : ఈ ఏడాది చివరికి వచ్చింది. పుష్ప2 వంటి భారీ బ్లాక్ బస్టర్‌తో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పబోతున్నాం. పుష్ప2తో టాలీవుడ్ సినీ పరిశ్రమ స్థాయి కూడా పెరిగింది.ఇక ఈ సినిమానే కాదు 2024 సంవత్సరంలో దేశంలో అతి పెద్ద రిలీజ్ లుగా పుష్ప 2, దేవర, కల్కి, ఫైటర్, స్ట్రీ 2, సింగం ఎగైన్, మరియు భూల్ భూలయ్యా 3తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎ ఏ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యింది అనేది ఆసక్తికరమైన విషయం. ఈ ఏడాదిలో కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి…
Indian Movie Tickets : 2024లో అత్యధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?
అయితే వాటన్నింటిలో కూడా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో అఫీషియల్ గా వెల్లడించడం విశేషం. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్ చూసినట్లు చెప్పుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టే విషయంలో ‘పుష్పరాజ్’ వాయువేగంతో దూసుకుపోతున్నాడు. పుష్ప2: ది రూల్’ మూవీ పుష్ప 2 సినిమా 21 రోజుల్లో ఏకంగా 1705 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ‘కేజీయఫ్2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది.
అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్ ‘దంగల్’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. కాగా, బాహుబలి 2 సినిమా 1800 కోట్లు వసూలు చేసి కలెక్షన్స్ విషయంలో రెండో హైయెస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది. మొదటి ప్లేస్ లో దంగల్ సినిమా 2000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఓ పక్క నార్త్ లో ఇంకా పుష్ప 2 హవా కొనసాగడం, మరో వైపు ఇంకా సంధ్య థియేటర్ వివాదంతో అల్లు అర్జున్, పుష్ప 2 రోజు వార్తల్లో ఉండటం, క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగేలా ఉన్నాయి. దీంతో ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్ ని ఈజీగానే అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ తరపున బన్నీ మరో సరికొత్త రికార్డ్ ని సెట్ చేసినట్టే.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
This website uses cookies.