2024 Rewind : 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

2024 Rewind : 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?

 Authored By ramu | The Telugu News | Updated on :27 December 2024,9:30 pm

ప్రధానాంశాలు:

  •  2024 Rewind : 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?

2024 Rewind  : ఈ ఏడాది చివ‌రికి వ‌చ్చింది. పుష్ప‌2 వంటి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌తో ఈ ఏడాదికి గుడ్ బై చెప్ప‌బోతున్నాం. పుష్ప‌2తో టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ స్థాయి కూడా పెరిగింది.ఇక ఈ సినిమానే కాదు 2024 సంవత్సరంలో దేశంలో అతి పెద్ద రిలీజ్ లుగా పుష్ప 2, దేవర, కల్కి, ఫైటర్, స్ట్రీ 2, సింగం ఎగైన్, మరియు భూల్ భూలయ్యా 3తో సహా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో ఎ ఏ సినిమా బుక్ మై షోలో ఎక్కువ టిక్కెట్లు అమ్ముడయ్యింది అనేది ఆసక్తికరమైన విషయం. ఈ ఏడాదిలో కల్కి 2898 ఏడీ, పుష్ప-2, స్త్రీ-2, సింగం ఏగైన్, భూల్ భూలయ్యా-2 లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి…

Indian Movie Tickets 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా

Indian Movie Tickets : 2024లో అత్య‌ధిక టిక్కెట్స్ అమ్ముడుపోయిన సినిమా ఏదో తెలుసా ?

Indian Movie Tickets పుష్ప‌2దే హ‌వా..

అయితే వాట‌న్నింటిలో కూడా పుష్ప-2 మరో ఘనతను సొంతం చేసుకుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఒక్క రోజులోనే అత్యధిక టికెట్స్ అమ్ముడైన చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ టికెటింగ్ ఫ్లాట్‌ఫామ్ బుక్ మై షో అఫీషియల్ గా వెల్లడించ‌డం విశేషం. అంతేకాకుండా అత్యధికంగా 10.8 లక్షల మంది సోలో ఆడియన్స్‌ చూసినట్లు చెప్పుకొచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు రాబట్టే విషయంలో ‘పుష్పరాజ్‌’ వాయువేగంతో దూసుకుపోతున్నాడు. పుష్ప2: ది రూల్‌’ మూవీ పుష్ప 2 సినిమా 21 రోజుల్లో ఏకంగా 1705 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ‘కేజీయఫ్‌2’ (రూ.1250 కోట్లు), ‘ఆర్ఆర్ఆర్’ (రూ.1,387 కోట్లు) ఆల్‌టైమ్‌ కలెక్షన్లు దాటేసిన ‘పుష్ప2’.. ‘బాహుబలి2’ (రూ.1810 కోట్లు) వసూళ్లను దాటే దిశగా వెళ్తోంది.

అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన భారతీయ చిత్రాల జాబాతాలో ఆమిర్‌ఖాన్‌ ‘దంగల్‌’ (రూ.2,024 కోట్లు) టాప్‌లో ఉంది. కాగా, బాహుబలి 2 సినిమా 1800 కోట్లు వసూలు చేసి కలెక్షన్స్ విషయంలో రెండో హైయెస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది. మొదటి ప్లేస్ లో దంగల్ సినిమా 2000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఓ పక్క నార్త్ లో ఇంకా పుష్ప 2 హవా కొనసాగడం, మరో వైపు ఇంకా సంధ్య థియేటర్ వివాదంతో అల్లు అర్జున్, పుష్ప 2 రోజు వార్తల్లో ఉండటం, క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ ఉండటంతో ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగేలా ఉన్నాయి. దీంతో ప్రభాస్ బాహుబలి 2 రికార్డ్ ని ఈజీగానే అల్లు అర్జున్ బ్రేక్ చేస్తాడని ఫ్యాన్స్ తో పాటు సినీ ట్రేడ్ వర్గాలు కూడా భావిస్తున్నాయి. ఇదే జరిగితే టాలీవుడ్ తరపున బన్నీ మరో సరికొత్త రికార్డ్ ని సెట్ చేసినట్టే.

Advertisement
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది