Categories: EntertainmentNews

Allu Arjun : ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు.. అల్లు అర్జున్ నే మెయిన్ టాపిక్ అయ్యాడుగా..!

Allu Arjun : పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ కి ఎంతో పేరు తెచ్చి పెట్టే ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటే అతన్ని ఈ సినిమా అనుకోని సమస్యల్లో పడేసింది. పుష్ప 2 ప్రీమియర్స్ టైం లో జరిగిన తొక్కిసలాట వల్ల ఒక ప్రాణం పోయింది అంతేకాదు అక్కడ తొక్కిసలాటలో గాయపడ్డ ఒక బాబు ఇంకా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు. ఇష్యూలో పోలీసులు ఒక వెర్షన్, అల్లు అర్జున్ మరో వెర్షన్ వినిపించారు. ఐతే అరెస్ట్ చేసి ఒక పూట జైలులో ఉన్న అల్లు అర్జున్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. ఈ ఘటనలో తప్పెవరిది అన్నది పక్కన పెడితే వేళ్లనీ అల్లు అర్జున్ వైపే చూపిస్తున్నాయి. ఈ ఇష్యూ వల్ల ఇండస్ట్రీ తరపున కొందరు వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడారు. ఐతే దీనిపై తమ్మారెడ్డి భరధ్వాజ ఘాటు కామెంట్స్ చేశారు. ఒక్కరు చేసిన తప్పు వల్ల ఇండస్ట్రీ అంతా తలదించుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.

Allu Arjun : ఓ వైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు.. అల్లు అర్జున్ నే మెయిన్ టాపిక్ అయ్యాడుగా..!

Allu Arjun జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు..

మరోపక్క ఈ ఇష్యూపై బడా నిర్మాత సురేష్ బాబు కూడా బయటకు వెళ్లే అవసరం లేనప్పుడు.. లేదా జన సమీకరణ ఎక్కువ ఉన్నప్పుడు వెళ్లకపోవడమే బెటర్ అని అన్నారు. అంతేకాదు మన ప్రవర్తనే దీన్ని సృష్టిస్తుందని.. జన ఎక్కువ ప్రదేశాల్లో జాగ్రత్త వహించాలి. నీ ఇంట్లో నువ్వు ఎగురు, డ్యాన్స్ చై ఏదైనా చెయ్యి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలని అన్నారు. ఈ కామెంట్స్ సురేష్ బాబు అల్లు అర్జున్ ని ఉద్దేశించే అన్నారని చెప్పకనే చెప్పొచ్చు.

ఇలా ప్రస్తుతం జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందని వీళ్లు విమర్శిస్తున్నారు. ఐతే ఇదిలాఉంటే మరోపక్క అల్లు అర్జున్ ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు బిగ్ బీ అమితాబ్. కౌన్ బనేగా కరోడ్ పతి షోలో హాట్ సీట్ లోని కంటెస్టెంట్ కి అల్లు అర్జున్, అమితాబ్ అంటే ఇష్టమని అనగా.. అమితాబ్ కూడా తనకు అల్లు అర్జున్ అంటే ఇష్టమని.. తాను పొందుతున్న ప్రశంసలు అన్నిటికీ ఆయన అర్హుడని తనని అల్లు అర్జున్ తో పోల్చొద్దని అన్నారు. ఇక్కడ కొందరు జరిగిన ఘటనపై బన్నీ పై ఘాటు కామెంట్స్ చేస్తుంటే దీనికి సంబంధం లేకుండా అమితాబ్ బన్నీని మెచ్చుకోవడం వెరైటీగా ఉంది. Allu Arjun, Amitabh Bachchan, Suresh Babu, Tammareddy Bharadhwaja, Social Media

Recent Posts

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

24 minutes ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

1 hour ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

2 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

3 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

4 hours ago

Etela Rajender : కేసీఆర్ ను కాపాడాల్సిన అవసరం నాకు లేదు – ఈటెల..!

Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…

5 hours ago

Telangana Cabinet Expansion : రేవంత్ బ్యాచ్‌లోకి మ‌రో ముగ్గురు మంత్రులు.. నేడే ప్ర‌మాణ స్వీకారం

Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్ట‌కేల‌కి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…

6 hours ago

Today Gold Price : ఈ రోజు కూడా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే..!!

Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…

7 hours ago