Amy Jackson : మళ్లీ తల్లి కాబోతున్న అమీ జాక్సన్.. ఈసారి కూడా పెళ్లి చేసుకోలేదట..?
Amy Jackson : సినిమా ఇండస్ట్రీ వాళ్లకు ఏదైనా త్వరగా కావాలి. దానికి సంప్రదాయాలు, కట్టుబాట్లు అవసరం లేదు. మనసులో అనుకున్నామా చాలు.వెంటనే అయిపోవాలి. ఏదైనా అడ్డంకులు వచ్చినా.. ఎవరైనా ప్రశ్నించినా నా లైఫ్ నా ఇష్టం. మీరు ఎవరు నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి అంటూ ఏకంగా రీల్‌లో చెప్పిన డైలాగ్స్ మనకు వాడుతారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కొందరు హీరో హీరోయిన్లు పెళ్లి కాకుండానే పిల్లలకు జన్మనిస్తున్నారు.గతంలో హీరో కమల్ హాసన్ ఇదే విధంగా చేయగా..మరో ఫారిన్ బ్యూటీ కూడా ఇలాగే చేసిన విషయం తెలిసిందే.
Amy Jackson : బిడ్డకు జన్మనిచ్చాక కూడా నో మ్యారేజ్
అమీ జాక్సన్.. ఈ అమ్మడి పేర వినే ఉంటారు. తమిళ, తెలుగు, బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో ఈ బ్యూటీ చాలా సార్లు వెండితెరపై సందడి చేసింది. రజినీకాంత్ సరసన రోబో -2, విక్రమ్ సరసన -ఐ సినిమాలో కనిపించింది. హీరో ధనుష్, తెలుగులో రాంచరణ్‌తో ఎవడు సినిమాలో కూడా చేసింది. ప్రస్తుతం ఈ అందాల తార ఒక బిడ్డకు జన్మనిచ్చి మరోసారి బిడ్డకు జన్మ నిచ్చేందుకు రెడీగా ఉందట.. అది కూడా పెళ్లి చేసుకోకుండానే అని వార్తలు వస్తున్నాయి. గతంలో అమీ జాక్సన్ పెళ్లిచేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి సంచలనానికి తెరలేపింది.
బిడ్డ జన్మించాక పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. కానీ ఇంతవరకు ఆమె పెళ్లి గురించి టాక్ రాలేదు. అమీజాక్సన్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్న తరుణంలో బడా వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో పడింది. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.చాలా కాలం డేటింగ్ లో ఉన్న ఈ జంట.. ఆ తర్వాత ఒక బాబుకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక గర్భవతిగా ఉన్న అమీ జాక్సన్ బిడ్డ పుట్టాక పెళ్లి చేసుకుంటామని తెలిపింది.కానీ బిడ్డ పుట్టాక జార్జ్ అమీని వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది.కొంత కాలం బాధపడిన అమీ ప్రస్తుతం హాలీవుడ్ నటుడు ఎడ్వెస్టిక్ తో ఎఫైర్‌లో ఉన్నట్టు కథనాలు వస్తున్నాయి. ఇతని వలన కూడా ఆమె మరో బిడ్డకు తల్లికాబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరు అయినా పెళ్లి చేసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే.