Bharateeyudu 2 : కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియన్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో 100 ఏళ్ళు పైబడిన సేనాపతిగా కమల్ హాసన్ ఎలాంటి విన్యాసాలు చేయబోతున్నారు ? శంకర్ ఈసారి ఈ చిత్రంలో ఎలాంటి అవినీతిని చూపించబోతున్నారు అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. మొదటి భాగం కంటే రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్రకు ఇంకాస్త ఇంపార్టెన్స్ పెంచారట. భారతీయుడు 2లో ప్రస్తుతం ఉన్న అవినీతి తో పాటు..టెక్నాలజీని కథలో భాగం చేసినట్టు తెలుస్తోంది. ఇక కమల్ హాసన్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను భయపెట్టడం ఖాయం అంటున్నారు.
ఈ సినిమా కోసం జనాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూడటానికి ముఖ్య కారణం కమల్ హాసన్. లోకనాయకుడి పెర్ఫార్మెన్స్ శంకర్ డైరెక్షన్ లో చూడటం కోసం అభిమానులుకి కనుల పండుగగా ఉంటుంది.. దర్శకుడు శంకర్ సాధారణంగా కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. ఐతే మళ్లీ ‘ఇండియన్ 2’లో అతడి మ్యాజిక్ ఉంటుందనడంలో సందేహం లేదు. ‘ఇండియన్ 2’ ట్రైలర్ లోనే కమల్ యాక్షన్ ని మించి సినిమా హైలైట్స్ అయిన లవ్, సెంటిమెంట్, ఒపీనియన్ ని ఫ్యాన్స్ గమనించారు. మరి శంకర్ ఎలా సర్ ప్రైజ్ చేయబోతున్నాడు అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అది కూడా మునుపెన్నడూ చేయని అద్భుతమైన పాత్రను పోషించాడు సిద్దార్ధ్.
శంకర్ డైరెక్షన్ లో సిద్దార్ధ్ 21 ఏళ్ళ తరువాత నటించాడు. అసలు సిద్దు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందే.. శంకర్ డైరెక్ట్ చేసిన బాయ్స్ సినిమాతో. మరి ఈసారి సిద్దును ఇండియన్ 2 లో ఎలా చూపించబోతున్నాడు అన్నది అందరిలో డౌట్. అయితే ఫిలిం నగర్ సమాచారం ప్రకారం.. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు, సిద్ధార్థ్ పాత్ర ‘ఇండియన్ 2’ మరియు కమల్ హాసన్‌తో ముడిపడి ఉంటుందని అంటున్నారు. ఇక భారతీయుడు సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, ఇప్పుడు సీక్వెల్‌కి అనిరుధ్ సంగీతం అందించారు. 2018లో రెహమాన్ ను ఈసినిమాకు పనిచేయాలని అడగ్గా.. తను ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ అనేశాడట. దాంతో అప్పుడు అనిరుధ్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చారు. మరోవైపు నటి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్‌జె సూర్య, బాబీ సింహా, వివేక్, నేదురుమూడి వేణు, గుల్షన్ గ్రోవర్, మనోబాల తదితరులు ‘ఇండియన్ 2’లో ముఖ్య పాత్రలు పోషించారు. వారిని ఎలా చూపించబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.