IRS Officer : ఇటీవలి కాలంలో చాలా మంది లింగ మార్పిడి చేసుకుంటున్నారు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారడానికి లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్తలు ఎక్కువగా చదువుతూ ఉంటాం. ఇక్కడ ఆపరేషన్ల లాంటి గోలేం లేకుండా… అమ్మాయి అబ్బాయిగా మారిపోయింది. అంతా అధికారికంగా జరిగిపోయింది. ఇలా మార్చుకున్న వారు సాదాసీదా వ్యక్తి కాదు సివిల్ సర్వీస్ కు చెందిన ఐఆర్ఎస్ అధికారి కావడం చర్చనీయాంశంగా మారంది. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) కు చెందిన సీనియర్ అధికారిణి తనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో పేరు, జండర్ మార్చుకున్నారు.
ఈ మేరకు సదరు ఐఆర్ఎస్ అధికారి చేసిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఆమోద ముద్ర వేసింది. ఇలాంటి కీలక పరిణామం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఇలా పేరు, జండర్ మార్చుకున్న ఆఫీసర్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే పనిచేస్తున్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన 2013 బ్యాచ్ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ ఎం.అనుసూయ.. కొంతకాలంగా హైదరాబాద్‌లోని ‘కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (సీఈఎ్‌సటీఏటీ)’ చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇకపై తనను పురుషుడిగా అనుసూయ.. ఇక అనుకతిర్ సూర్య గుర్తించాలని.. ఎం.అనసూయకు బదులుగా తన పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చుకోవడానికి, రికార్డుల్లో తన లింగాన్ని మార్చుకోవడానికి అనుమతించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగానికి చెందిన ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్’ను అభ్యర్థించారు. దీనికి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతించింది.
లింగ మార్పిడికి సంబంధించి 2014లో ‘నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా)’ కేసులో సుప్రీంకోర్టు తన తీర్పులో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము పురుషులుగా ఉండాలా లేక మహిళలుగా ఉండాలా అనేది వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేసింది. అనుకతిర్ సూర్య విషయానికి వస్తే.. 2013 బ్యాచ్ కు చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి ఎం అనసూయ. 2018లో డిప్యూటీ కమిషనర్ గా ప్రమోషన్ పొందారు. గత ఏడాది నుంచి హైదరాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.