Game Changer : సాంగ్స్ కోసమే 75 కోట్లు.. ఇది శంకర్ మార్క్ అంటే గేమ్ చేంజర్ బీభత్సం అంతే..!
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ అంటూ కొత్త సినిమాతో రాబోతున్నాడు. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఐతే ఈ సినిమా బడ్జెట్ విషయంలో నిర్మాత దిల్ రాజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. శంకర్ సినిమా అంటేనే తెర మీద భారీతనం ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో శంకర్ మార్క్ మ్యాజిక్ ఉండాల్సిందే. సాంగ్స్ లో శంకర్ చూపించే మెరుపులు అన్నీ ఇన్నీ కావు. శంకర్ సినిమాల లానే ఆయన సాంగ్స్ కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఐతే ఆ సెంటిమెంట్ ప్రకారంగానే రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కూడా సాంగ్స్ ని నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కించారు. కేవలం సాంగ్స్ కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. 75 కోట్లు కేవలం సాంగ్స్ కోసమా అని నోరెళ్ల బెట్టొచ్చు.. ఆ బడ్జెట్ లో ఒక పెద్ద హీరో సినిమా కూడా తీసేయొచ్చు. కానీ శంకర్ సినిమా విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వడు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎక్సాంపుల్.
Game Changer విజువల్ ఫీస్ట్ అందించేలా..
గేమ్ చేంజర్ సినిమాలో జరగండి సాంగ్ కోసం 16 కోట్ల సెట్ వేశారు. ధోప్ సాంగ్ కోసం వేల కొద్ది లైట్స్ ని అరెంజ్ చేశారు. నానా హైరానా సాంగ్ న్యూజిలాండ్ అందాల్లో తీశారు. ఇలా ప్రతి సాంగ్ ఆడియన్ కి ఒక విజువల్ ఫీస్ట్ అందించేలా భారీతనంతో గ్రాండియర్ గా తెరకెక్కించారు. అందుకే గేమ్ చేంజర్ సినిమా సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.
ఇక ఇప్పటికే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడగా సుకుమార్ లాంటి డైరెక్టర్ రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ వస్తుందని అనడంతో ఇంకాస్త అంచనాలు పెరిగాయి. అవార్డ్ సంగతి అటుంచితే దాదాపు ఐదేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో సినిమాగా గేమ్ చేంజర్ వస్తుంది. ఎ సినిమా తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర తన మాస్ స్టామినా ఏంటో చూపించాలని ఫిక్స్ అయ్యాడు రామ్ చరణ్. Ram Charan, Shankar, Game Changer, 75 Crores for Songs, Dil Raju, Kiara Advani