Game Changer vs Daku Maharaj : రిలీజే కాదు ఈవెంట్స్ లో కూడా పోటీనా.. గేమ్ ఛేంజర్ VS డాకు మహారాజ్..!
ప్రధానాంశాలు:
Game Changer vs Daku Maharaj : రిలీజే కాదు ఈవెంట్స్ లో కూడా పోటీనా.. గేమ్ ఛేంజర్ VS డాకు మహారాజ్..!
Game Changer vs Daku Maharaj : సినిమా ఈవెంట్స్ ఇప్పుడు వెన్యూ మార్చుకున్నాయి. మొన్నటిదాకా హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరుగుతూ వచ్చిన సినిమా ఈవెంట్స్ ఇప్పుడు హైదరాబాద్ కాదు ఏకంగా యూఎస్ వేదిక చేసుకుంటున్నాయి. డల్లాస్ లో తెలుగు ప్రజలు ఎక్కువ దాదాపు అక్కడ వారంతా కూడా సినిమాలను బాగా ఆదరిస్తారు. అందుకే మన వాళ్లు దాన్ని డల్లాసపురం అనేస్తారు. అక్కడ ఉన్న సినీ ప్రియుల కోసం డల్లాస్ లో మెగా ఈవెంట్ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు.
ఐతే ఈ వేడుక గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో మళ్లీ మరో ఈవెంట్ కి ప్లాన్ చేస్తున్నారు. డల్లాస్ లో సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛేంజర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు అదే సంక్రాంతికి వస్తున్న బాలకృష్ణ Balakrishna డాకు మహారాజ్ Daku Maharaj కోసం వెన్యూ ఫిక్స్ చేశారు. జనవరి 4న టెక్సాస్ ట్రస్ట్ కు థియేటర్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు.
Game Changer vs Daku Maharaj డాకు మహారాజ్ ఈవెంట్..
డల్లాస్ లో మొదటి ఈవెంట్ గేమ్ ఛేంజర్ కాగా దానికి పోటీగా డాకు మహారాజ్ ఈవెంట్ ని కూడా అక్కడే ప్లాన్ చేశారు. గేమ్ ఛేంజర్ చేశారని చేస్తున్నారో లేదా ఆ సినిమా ఈవెంట్ కు గ్రాండ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి చేస్తున్నారో కానీ ఈ ఈవెంట్ ప్లాన్ చేయడంతో సినిమాలతోనే కాదు ఈవెంట్స్ తో కూడా సంక్రాంతి సినిమాలు పోటీ పడుతున్నాయని అనిపిస్తుంది.
గేమ్ ఛేంజర్ వర్సెస్ డాకు మహారాజ్.. ఈ సినిమాల ఫైట్ తో సంక్రాంతి అదిరిపోబోతుంది. ఐతే ఈ ఈవెంట్స్ లో కూడా ఈ ఫైట్ సర్ ప్రైజింగ్ గా ఉంది. డల్లాస్ లో ఆల్రెడీ గేమ్ ఛేంజర్ ఈవెంట్ మెగా ఫ్యాన్స్ అందరినీ ఖుషి చేయగా ఇక ఇప్పుడు జరగబోయే ఈవెంట్ తో నందమూరి ఫ్యాన్స్ హంగామా ఏంటో చూపించాలని చూస్తున్నారు. సంక్రాంతికి గేం ఛేంజర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుండగా డాకు మహారాజ్ సినిమా ఊర మాస్ సినిమాగా వస్తుంది. రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయని తెలిసిందే.