Bollywood Actress Rimi Sen : బాలీవుడ్ నటి రిమీ సేన్ తన కారుతో సమస్యలను ఎదుర్కొన్నందుకు కార్ కంపెనీ ల్యాండ్ రోవర్‌పై రూ.50 కోట్ల కోసం దావా వేసింది. సేన్ 2020లో రూ.92 లక్షలకు కారును కొనుగోలు చేసింది. తన ఫిర్యాదులో కారుకు సంబంధించిన మరమ్మతుల విషయంలో మానసిక వేదనలకు గురైనట్లు ఆమె ఆరోపించారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ వాహనాన్ని ఆమె సతీష్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసింది. ఇది జనవరి 2023 వరకు చెల్లుబాటు అయ్యే వారంటీ కలిగి ఉంది.
అయితే COVID-19 మహమ్మారి మరియు తదుపరి లాక్‌డౌన్‌ల కారణంగా ఆంక్షలు ఎత్తివేసే వరకు కారును ఎక్కువగా ఉపయోగించలేదు. అనంతరం వాహనాన్ని ఉపయోగించడం ప్రారంభించినప్పుడు కారులోని అనేక లోపాలను ఆమె గుర్తించింది. వీటిలో సన్‌రూఫ్, సౌండ్ సిస్టమ్ మరియు వెనుక కెమెరాతో సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. 2022 ఆగస్టు 25న వెనుక వైపు కెమెరా పని చేయకపోవడం వల్ల పిల్లర్‌ను కారు ఢీకొట్టిందని సేన్ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సమస్యల గురించి డీలర్‌కు తెలిపితే సాక్ష్యం కోసం అడిగి తిరస్కరించినట్లుగా తెలిపింది. కారులో ఒక సమస్య పరిష్కరిస్తే మరో సమస్య ఉత్పన్నమవుతున్నట్లు వెల్లడించింది.
సేన్ దాఖలు చేసిన లీగల్ నోటీసులో కారు తయారీలో మరియు అధీకృత డీలర్ ద్వారా దాని తదుపరి నిర్వహణ లోప భూయిష్టంగా ఉందని పేర్కొంది. పదిసార్లు కారు మరమ్మతుల కోసం పంపబడినప్పటికీ అది సరికాలేదంది. దీనివల్ల తనకు మానసిక వేధింపులు మరియు అసౌకర్యం కలిగిందని ఆమె వెల్లడించింది. కావునా తాను అనుభవించిన మానసిక వేధింపులకు రూ.50 కోట్లు, అలాగే న్యాయపరమైన ఖర్చుల కోసం అదనంగా మరో రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అలాగే ఆ కారు స్థానంలో మరో కారును ఇవ్వాలని కోరింది.
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
This website uses cookies.