Anjali : త్వరలోనే అంజలి పెళ్లి .. వరుడు తెలుగు అబ్బాయి మాత్రం కాదు ..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :15 March 2023,9:40 am

Anjali : టాలీవుడ్ బ్యూటీ అంజలి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పేరుకు తెలుగమ్మాయి అయినా తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. తన అందం ,నటనతో ప్రేక్షకులను మెప్పించగలిగే అంజలి తెలుగువారిని మెప్పించలేకపోయింది. ఎక్స్పోజింగ్ విషయంలో తెలుగు అమ్మాయి అయి ఉండి కూడా మితిమీరి ఎక్స్పోజింగ్ చేసింది అయినా కానీ టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు అంతగా ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ లో మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకెళుతోంది.

Actress Anjali Is All Set To Get Married

Actress Anjali Is All Set To Get Married

ఇండస్ట్రీకి వచ్చి పది ఏళ్లకు పైనే అవుతున్న టాలీవుడ్ లో ఇంతవరకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడలేదు. కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ను అందుకుంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అంజలి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా హిట్ అయితే అంజలికి తిరుగు ఉండదు. ఇకపోతే అంజలి ప్రేమ, పెళ్లి గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి.

అమ్మ దొంగ????: Nagarjuna CUTE Reaction Towards Actress Anjali | Actress Anjali  H0T Looks In Black Saree - YouTube

ముందుగా ఆమె కోలీవుడ్ నటుడు జైతో కలిసి రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరిద్దరు కలిసి మూడు నాలుగు ఏళ్ళు డిప్ ప్రేమలో ఉన్నారు. తర్వాత గ్యాప్ వచ్చి విడిపోయారు. ఇక ఇప్పుడు అంజలికి తల్లిదండ్రులు మంచి సంబంధం చూశారని, పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అంజలికి ఒకప్పుడు కుటుంబంతో విభేదాలు ఉండేవని తెలుస్తుంది. ఇప్పుడు అందరూ కలిసిపోవడంతో తల్లిదండ్రులను గౌరవించి పెళ్లికి రెడీ అయినట్లు తెలుస్తుంది. వరుడు తెలుగు అబ్బాయి అయినా చెన్నైలో ఉంటున్నట్లు తెలుస్తుంది. దీంతో అంజలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందని తెలుస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి