
Ester Noronha : ఒంటరిగా ఉండలేకపోతున్నా.. మనసులో కోరిక బయటపెట్టిన నోయల్ భార్య..!
Ester Noronha సింగర్ నోయల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సందడి చేశాడు. ఆయన నటి ఎస్తేర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2019లో ప్రముఖ సింగర్ అండ్ ర్యాపర్ నోయెల్ సేన్‌ను వివాహం చేసుకోగా.. ఈ జంట 2020లో విడిపోయిన సంగతి విదితమే. ఎస్తేర్ కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇవ్వగా.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీకి మంచి క్రేజ్ దక్కింది. గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.
ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించిన ఈ చిన్నది తనదైన నటనతో మెప్పించింది. . తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్ కావాలి, బ్యూటీఫుల్ లైఫ్ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ తనదైన స్టైల్‌లో బోల్డ్ కామెంట్స్ చేసింది.
Ester Noronha : ఒంటరిగా ఉండలేకపోతున్నా.. మనసులో కోరిక బయటపెట్టిన నోయల్ భార్య..!
నోయల్ నుండి విడిపోయిన తర్వాత.. వెండితెరపై రొమాంటిక్ అండ్ బోల్డ్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తున్న ఎస్తేర్ 69 సంస్కార్ కాలనీలో ఒక టీనేజ్ కుర్రాడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే మహిళగా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత లోకల్ ట్రైన్, డీఎన్ఎ కన్నడ చిత్రాలతో పాటు రెక్కీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో కూడా గ్రామ పెద్దతో వివాహేతర సంబంధం పెట్టుకునే మహిళగా కనిపించి అదరహో అనిపించింది. ఎస్తేర్ రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
Kavitha : తెలంగాణ రాజకీయాలు మున్సిపల్ ఎన్నికలతో మరింత వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల సరసన,…
Chintakayala Vijay : టీడీపీ నాయకుడు చింతకాయల విజయ్ ఇటీవల తన సొంత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన హెచ్చరికలు…
Anasuya : వివాదాస్పద అంశాలపై మౌనం వహించకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో…
Train Ticket Booking : భారతీయ రైల్వే తన ప్రీమియం సర్వీసులైన వందే భారత్ స్లీపర్ మరియు అమృత్ భారత్…
Post Office Franchise 2026 : సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా తక్కువ పెట్టుబడితో ప్రభుత్వ మద్దతు కోరుకునే…
ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 'రేంజ్' (మైలేజీ) అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. ఆ సమస్యకు పరిష్కారంగా కొమాకి సంస్థ…
Aadabidda Nidhi Scheme : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి…
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 'సక్సెస్' అనే పదానికి పర్యాయపదంగా మారారు దర్శకుడు అనిల్ రావిపూడి. అపజయమెరుగని దర్శకుడిగా పదేళ్ల ప్రస్థానాన్ని…
This website uses cookies.