Ester Noronha : ఒంట‌రిగా ఉండలేక‌పోతున్నా.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నోయ‌ల్ భార్య‌..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ester Noronha : ఒంట‌రిగా ఉండలేక‌పోతున్నా.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నోయ‌ల్ భార్య‌..!

Ester Noronha సింగ‌ర్ నోయ‌ల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సంద‌డి చేశాడు. ఆయ‌న న‌టి ఎస్తేర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2019లో ప్రముఖ సింగర్ అండ్ ర్యాపర్ నోయెల్ సేన్‌ను వివాహం చేసుకోగా.. ఈ జంట 2020లో విడిపోయిన సంగతి విదితమే. ఎస్తేర్ కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇవ్వ‌గా.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 May 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Ester Noronha : ఒంట‌రిగా ఉండలేక‌పోతున్నా.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నోయ‌ల్ భార్య‌..!

Ester Noronha సింగ‌ర్ నోయ‌ల్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సంద‌డి చేశాడు. ఆయ‌న న‌టి ఎస్తేర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2019లో ప్రముఖ సింగర్ అండ్ ర్యాపర్ నోయెల్ సేన్‌ను వివాహం చేసుకోగా.. ఈ జంట 2020లో విడిపోయిన సంగతి విదితమే. ఎస్తేర్ కన్నడ సినిమాలతో ఎంట్రీ ఇవ్వ‌గా.. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్‌గా ఇచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన వేయి అబ్బాదాలు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా నటించింది.మరీ ముఖ్యంగా భీమవరం బుల్లోడులో నటించిన తర్వాత ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ద‌క్కింది. గరం, జయ జానికి నాయక, జాలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, నయనం, ఐరావతం,69 సంస్కార్ కాలనీ, చాంగురే బంగారు రాజా, డేవిల్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ వంటి వాటిల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది.

Ester Noronha నోయ‌ల్ షాకింగ్ కామెంట్స్

ఇటీవలే కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన డెవిల్: బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సినిమాలో నటించిన ఈ చిన్న‌ది త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది. . తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాకు ఒంటరిగా బతకాలని లేదు. పెళ్లి చేసుకోవాని ఉంది. నాకు పార్టనర్‌ కావాలి, బ్యూటీఫుల్‌ లైఫ్‌ కావాలి. కానీ ఎవరిని చేసుకోవాలి అనేదానిపై పూర్తి క్లారిటీ లేదు. ఇప్పటికే మొదటి పెళ్లితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబ‌ట్టి నన్ను అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. షోకేస్ లాంటి మొగడు వద్దు అంటూ త‌న‌దైన స్టైల్‌లో బోల్డ్ కామెంట్స్ చేసింది.

Ester Noronha ఒంట‌రిగా ఉండలేక‌పోతున్నా మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నోయ‌ల్ భార్య‌

Ester Noronha : ఒంట‌రిగా ఉండలేక‌పోతున్నా.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టిన నోయ‌ల్ భార్య‌..!

నోయల్ నుండి విడిపోయిన తర్వాత.. వెండితెరపై రొమాంటిక్ అండ్ బోల్డ్ చిత్రాల్లో నటిస్తూ అల‌రిస్తున్న ఎస్తేర్ 69 సంస్కార్ కాలనీలో ఒక టీనేజ్ కుర్రాడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకునే మహిళగా నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత లోకల్ ట్రైన్, డీఎన్ఎ కన్నడ చిత్రాలతో పాటు రెక్కీ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో కూడా గ్రామ పెద్దతో వివాహేతర సంబంధం పెట్టుకునే మహిళగా కనిపించి అద‌ర‌హో అనిపించింది. ఎస్తేర్ రెండో పెళ్లిపై చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది