Home » Entertainment » Actress Pragathi Maas Steps With Hyper Aadi In Sridevi Drama Company
Entertainment

Pragathi : ఊర మాస్ అంటే ఇదీ.. ప్రగతితో కలిసి ఊపేసిన హైపర్ ఆది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: July 7, 2022, 8:00 pm
Advertisement

Pragathi : హైపర్ ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో చేసే డ్యాన్సులు, వేసే కౌంటర్లు అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీదేవీ డ్రామా కంపెనీ మొత్తం కూడా ఆది హస్తగతమైనట్టుంది. సుధీర్, ఇంద్రజ వెళ్లిపోవడంతో అక్కడంతా కూడా ఆది డామినేషన్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆది, రాం ప్రసాద్ ఇద్దరే ఆ షోను ముందుండి నడిపిస్తున్నారు. యాంకర్‌గా వచ్చిన రష్మీది కూడా నామ మాత్రంగానే అయిపోయింది. ఇప్పుడు అక్కడంతా కూడా ఆదిదే ఆధిపత్యమైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఆది దుమ్ములేపేశాడు. ఈ ఆదివారం ఆషాడ మాసం మీద ప్రోగ్రాం చేశారు.

Advertisement

ఆషాడంలో అల్లుళ్లు అంటూ చేసిన ఈ ప్రోగ్రాంలో ప్రగతి ముఖ్య అతిథిగా వచ్చింది. ఇక ప్రగతి వర్కవుట్ల మీద కూడా ఆది సటైర్లు వేశాడు. ప్రగతి ఎప్పుడూ జిమ్‌లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆమె వర్కవుట్ వీడియోలు ఎంతగా వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రగతిని ఏదైనా వర్కవుట్ టిప్స్ చెప్పమని ఆది అడుగుతాడు. ఇంతలో ఆమె వర్కవుట్ వీడియోను ఎడిట్ చేసి కామెడీగాప్లే చేసి చూపించారు. దీంతో ప్రగతితో పాటు అందరూ నవ్వేశారు. ఇక ప్రగతి సైతం ఓ పర్ఫామెన్స్ చేసింది. స్టేజ్ మీదకు వచ్చింది ఊర నాటు స్టెప్పులు వేసింది. చీరలో అలా ప్రగతి ఊపేస్తోంటే.. ఆది కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.

Pragathi Maas Steps With Hyper Aadi in Sridevi Drama Company

Advertisement

ఆది ప్రగతి వేసిన ఈ మాస్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నాలో ఉన్న మాస్ యాంగిల్ మొత్తాన్ని బయటకు తీశారు అంటూ ప్రగతి అనేసింది. ఆది, రాం ప్రసాద్ ఇలా అందరూ కూడా మాస్ అంటే మాస్ అనే రేంజ్‌లో అదరగొట్టేశారు. ఈ ప్రోమోలో ప్రగతి ఊపడం మాత్రం హైలెట్ అయింది. అసలే ప్రగతికి చిన్నప్పటి నుంచి ఇలాంటి మాస్ స్టెప్పులు వేయాలనే కోరిక ఉందట. చిన్నతనంలో డ్యాన్స్ కూడా నేర్చుకుందట. కానీ వెండితెరపై అలాంటి చాన్సులు ఎప్పుడూ రాలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఇలా ఊర నాటు స్టెప్పులు వేసి ఆ కోరిక తీర్చుకున్నట్టుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి