
Actress Sadaa Comments About Her Coming Husband
Actress Sadaa : సదా.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. జయం సినిమాలో నితిన్ సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఈ ముద్దుగుమ్మ తర్వాత కూడా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ సదాకు ఇండస్ట్రీలో అంతగా ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే తాజాగా హోల్డ్ వరల్డ్ అనే సిరీస్ ద్వారా డిజిటిల్ ఎంట్రీ ఇచ్చారు. సోషల్ మీడియా ద్వారా తెగ సందడి చేస్తూ క్యూట్ క్యూట్ అందాలతో మెప్పిస్తూ ఉంటుంది.
తాజాగా సదా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసింది. జయం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఔనన్నా కాదన్నా చిత్రాన్ని ఆదరించలేదు. ఇక ఈ సినిమా హిట్ కాలేదని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేశారు. మన జీవితం మీద అలాంటి కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా ? ఎవరూ హ్యాపీగా ఉండడం లేదు.
Actress Sadaa Comments About Her Coming Husband
నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్ కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి శాఖాహారిగా ఉండాలి. ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. నా సంపాదనపైనో.. మరొకరి సంపాదన పైనో ఆధారపడకూడదనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. సదా ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకైన కోరుకున్న వ్యక్తి భర్తగా దొరుకుతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.