Actress Sadaa : కాబోయే భ‌ర్త ఇలా ఉండాలి అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన స‌దా

Advertisement

Actress Sadaa : స‌దా.. ఈ అమ్మ‌డు తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. జ‌యం సినిమాలో నితిన్ స‌ర‌స‌న న‌టించి మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందిన ఈ ముద్దుగుమ్మ త‌ర్వాత కూడా చాలా మంది స్టార్ హీరోల‌తో క‌లిసి పని చేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించింది. అయితే సూపర్ హిట్స్ అందుకున్నప్పటికీ సదాకు ఇండస్ట్రీలో అంతగా ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇటీవలే బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అలాగే తాజాగా హోల్డ్ వరల్డ్ అనే సిరీస్ ద్వారా డిజిటిల్ ఎంట్రీ ఇచ్చారు. సోష‌ల్ మీడియా ద్వారా తెగ సంద‌డి చేస్తూ క్యూట్ క్యూట్ అందాల‌తో మెప్పిస్తూ ఉంటుంది.

Advertisement

Actress Sadaa : స‌దా షాకింగ్ కామెంట్స్..

తాజాగా స‌దా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేసింది. జయం సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఔనన్నా కాదన్నా చిత్రాన్ని ఆదరించలేదు. ఇక ఈ సినిమా హిట్ కాలేదని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం కరెక్ట్ కాదు. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు చాలా మంది నన్ను పెళ్లి చేసుకోండి ప్లీజ్ అంటూ కామెంట్స్ చేశారు. మన జీవితం మీద అలాంటి కామెంట్స్ చేసే హక్కును వారికెవరిచ్చారు. అలాంటి వారికి నేనెందుకు సమాధానం చెప్పాలి. ప్రస్తుతం పది మంది పెళ్లి చేసుకుంటే అందులో 5 జంటలైనా పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా ? ఎవరూ హ్యాపీగా ఉండడం లేదు.

Advertisement
Actress Sadaa Comments About Her Coming Husband
Actress Sadaa Comments About Her Coming Husband

నా జీవితాన్ని నేను సంతోషంగా గడపాలనుకుంటున్నాను. పార్టీలకు, పబ్స్ కు వెళ్లను. ఆల్కహల్, నైట్ ఔట్స్ చేయను. ఒక వ్యక్తిపై ఆధారపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉండలేరు. నీ సంతోషం కోసం నువ్వు మరో వ్యక్తిపై నీ ఒత్తిడి కూడా అతనే భరించాలి. నేను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి శాఖాహారిగా ఉండాలి. ధనవంతుడు కానక్కర్లేదు. ఒకరిపై ఆధారపడకుండా ఉంటే చాలు. నా సంపాదనపైనో.. మరొకరి సంపాదన పైనో ఆధారపడకూడదనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది. స‌దా ఇన్నాళ్లు పెళ్లి చేసుకోకుండా ఉన్నందుకైన కోరుకున్న వ్య‌క్తి భ‌ర్త‌గా దొరుకుతాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement
Advertisement