Hyper Aadi : హైపర్ ఆది ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాడు. జబర్దస్త్ షోలో కనిపించకపోయినా శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ షోలతో దుమ్ములేపుతున్నాడు. జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఇన్ని ప్రాజెక్ట్‌లు ఉండటంతోనే కాస్త బ్రేక్ ఇచ్చానని, మళ్లీ వస్తాను అంటూ ఆది చెప్పేశాడు. అయితే ఎప్పుడు వస్తాడో మాత్రం చెప్పలేదు. అయితే ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో కింగ్ మేకర్‌లా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఆది చెప్పిందే అక్కడ జరుగుతుందేమోననిపిస్తోంది. మొత్తానికి ఆది మాత్రం శ్రీదేవీ డ్రామా కంపెనీని నిలబెట్టేస్తున్నాడు. ప్రతీ వారం ఓ సెలెబ్రిటీలు గెస్టుగా వస్తున్నారు. ఇంద్రజ వెళ్లిపోవడంతో ఆ స్థానంలోకి పూర్ణ వచ్చింది. కానీ ఆమె ఎఫెక్ట్ చూపించడం లేదు.
ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో సంఘవి వచ్చింది. తెలుగు ప్రేక్షకులకు సంఘవి గురించి పరిచయం చేయనక్కర్లేదు. ఏవండోయ్ శ్రీవారు.. మొదటి సారి ముద్దు పెడితే ఎలాగుంటది అనే పాటలతో సంఘవి ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అయితే ఇదే పాటతో సంఘవిని ఆడుకున్నాడు ఆది. సంఘవి ఎంట్రీతోనే ఆది తన ప్రతాపాన్ని చూపించాని అనుకున్నాడు. సంఘవి గారు.. మొదటి సారి ముద్దు పెడితే ఎలాగుంటది అని అన్నారు కదా? అని అడుగుతాడు. అవును బాగుంటుంది.. మరి రెండో సారి పెడితే ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తాడు ఆది. బాగానే ఉంటుంది..
ముందు నీకు రెండు తగిలిస్తే ఇంకా బాగుంటుందని కౌంటర్లు వేస్తుంది. దీంతో ఆది తన తోక ముడుచుకుని సైలెంట్ అవుతాడు. అలా ఆదికి అదిరిపోయే పంచ్ వేసి నోర్మూయించింది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో సంఘవి అదరగొట్టేసింది. మొత్తానికి ఇప్పుడు ఆది మాత్రం అన్ని చోట్లా అదరగొట్టేస్తున్నాడు. శ్రీదేవీ డ్రామా కంపెనీ కూడా కొత్త ఆలోచనలు చేస్తోంది. ఇప్పుడు కాలెండర్ అంటూ ఏ ఏ నెలల్లో ఏ ఏ ప్రోగ్రాంలు చేస్తామో వివరించారు. దీంతో పాటుగా ముందుగానే అన్నీ ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో కాలెండర్ గురించి అసలు విషయం చెప్పబోతోన్నట్టు కనిపిస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.