Sneha : మత్తెక్కించే చూపులతో కుర్రకారును కవ్విస్తోన్న స్నేహ

Authored By mallesh | The Telugu News | Published on: October 13, 2021, 2:40 pm

Sneha : హీరోయిన్ స్నేహ అనగానే అందరికీ గుర్తొచ్చేది అందం, అభినయం. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టు కలగలపిన ముఖారవిందం ఆమె సొంతం. కుటుంబం మొత్తం కలిసిమెలిసే చూడదగిన సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ మూవీస్‌కు మొదటి ప్రాముఖ్యత ఇవ్వొచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్స్పోజింగ్ లేకుండా సినిమాలు చేసిన అతి తక్కువ హీరోయిన్లలో స్నేహ ఒకరు.

Actress Sneha Latest Photos Goes Viral

Actress Sneha Latest Photos Goes Viral

Sneha : స్నేహ పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని బాంబే అయినా ఆమె తెలుగు చిత్రపరిశ్రమకు బాగా సుపరిచితురాలు. తొలుత తమిళ సినిమాలు చేసిన స్నేహ ఆ తర్వాత 2001లో ప్రియమైన నీకు సినిమాతో తెలుగు ఇండ్రస్టీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఆమెకు అంత పేరు తీసుకురాలేదు. కానీ 2004లో వచ్చిన వెంకీ సినిమాతో స్నేహ తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లు తలుపుతట్టాయి. దాదాపు పెద్ద హీరోలు అందరితో స్నేహ స్క్రీన్ షేర్ చేసుకుంది. సంక్రాంతి మూవీలో వెంకటేష్ సరసన నటించి ఫ్యామిలీ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

Actress Sneha Latest Photos Goes Viral

Actress Sneha Latest Photos Goes Viral

స్నేహ ప్రసన్న అనే నటుడిని పెళ్లి చేసుకున్న అనంతరం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది. కానీ, ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించింది. తెలుగులో మళ్లీ వినయ విధేయ రామతో తెలుగు తెరపై కనిపించింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక, మూడు పదుల వయస్సులోనూ స్నేహ అందం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. తాజాగా ట్విట్టర్‌లో స్నేహ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ చీరకట్టుతో మత్తెక్కించే కళ్లతో కుర్రకారును కవ్విస్తోంది స్నేహ. లేత గులాబీ రంగు సారీలో దిగిన లేటెస్ట్ ఫోటోలకు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురస్తోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp