Actress : 16 ఏళ్ల వయస్సులో ఆడిషన్కి వెళితే కమిట్మెంట్ అడిగారన్న హీరో భార్య..!
Actress : సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనే అంశం ఎంత సంచలమైనదో మా అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా కనిపించేది. దీని కారణంగా ఎంతో మంది నటీమనులు ఎన్నో రకాల ఇబ్బందులు కూడా పడ్డారు. స్టార్ భామల దగ్గర నుండి చిన్న స్థాయి టీవీ నటీమనుల వరకు చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారు. అయితే తాజాగా మీట్ ఉద్యమంలో భాగంగా కొందరు నటీనటులు ఈ క్యాస్టింగ్ కౌచ్ పై వారికి ఎదురైనా అనుభవాలను ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ఇక ఈ కాస్టింగ్ కౌచ్ వలన వారు పడిన ఇబ్బందులను చాలామంది బయటపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ బ్యూటీ శ్రీజిత ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న కొన్ని రకాల సంఘటనల గురించి మీడియాతో చెప్పడం జరిగింది. అయితే శ్రీజితకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. నార్త్ ఇండియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ బెంగాలీ పాత్రలతో ఫేమస్ అయ్యింది.ఆ తర్వాత అక్కడినుండి బిగ్ బాస్ కిి ప్రమోట్ అయి ఫేమస్ అయింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీజిత తాను ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎదురుకున్న సమస్యల గురించి అలాగే ఓ సినిమా ఛాన్స్ కోసం ఒక డైరెక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతను తనతో అసభ్యకరంగా ప్రవర్తించారనే విషయాలను కూడా ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను 17 ఏళ్లకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. అయితే నాతో ఎప్పుడూ మా అమ్మ కూడా ఉండేది. ఇక ఆ సమయంలో మా అమ్మ దగ్గర నేను ఏ విషయం దాచే దానిని కాదు. కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత కొంతమంది చెడు వ్యక్తుల మధ్య కూడా తిరగాల్సి వచ్చింది. ఛాన్స్ ల పేరుతో మీటింగ్స్ పేరుతో చాలామంది ఆఫీసులకు పిలిపించుకుని టైంపాస్ చేసేవారు. మరి కొందరైతే ఎలాంటి మొహమాటం లేకుండా ముఖం పైనే కమిట్ మెంట్ అడిగేసేవారు. అయితే వీటన్నింటిలో నన్ను భయపెట్టిన ఘటన ఒకటి ఉందంటూ ఈ సందర్భంగా శ్రీజిత చెప్పుకొచ్చారు.
అయితే ఒకానొక సందర్భంలో సినిమా ఛాన్స్ కోసం ఓ డైరెక్టర్ నన్ను పిలిచారు. అప్పుడు నాకు తోడుగా మా అమ్మ కూడా లేదు. దీంతో నేను డైరెక్టర్ వద్దకు సింగిల్ గానే వెళ్లాల్సి వచ్చింది. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత డైరెక్టర్ మాట్లాడుతూ అదును చూసి నా భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నాతో మాట్లాడే విధానం కూడా చాలా తేడాగా అనిపించింది. ఇక ఆ డైరెక్టర్ ప్రవర్తించే తీరు చూస్తే ఎలాంటి మహిళకైనా అతని తప్పుడు ఉద్దేశంతోనే ఉన్నాడని తెలిసిపోతుంది. ఇక ఆ డైరెక్టర్ నన్ను చూసే విధానం కూడా చాలా అసహ్యంగా ఉండటంతో వెంటనే అతని దగ్గర నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అయితే శ్రీజిత ఆ డైరెక్టర్ ఎవరు అనే విషయాలను బయట పెట్టలేదు కానీ తాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లో తాను ఎదురుకున్న సమస్యల గురించి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.