Sreeleela : అమ్మ ముందైనా.. ఎవరి ముందైనా సిగ్గు లేకుండా అలాగే చేస్తా.. ధమాకా హీరోయిన్ శ్రీలీల కామెంట్స్ వైరల్

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 10, 2023, 3:00 pm

Sreeleela : ప్రస్తుతం తెలుగులో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే ఆమె శ్రీలీల అనే చెప్పుకోవాలి. అవును.. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉంది. యంగ్ బ్యూటీ శ్రీలీలకు తెలుగులో ఉన్న క్రేజ్ వేరు. పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ సెలబ్రిటీ అయిపోయింది శ్రీలీల. దానికి కారణం తన అందం, డ్యాన్స్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోయిన్ కూడా శ్రీలీల వేసినట్టుగా డ్యాన్స్ వేయలేదు. పెళ్లి సందడి సినిమా అయినా.. ఇటీవల రిలీజ్ అయిన ధమాకా సినిమా అయినా

శ్రీలీల డ్యాన్స్ చూస్తే అదుర్స్ అనాల్సిందే.ధమాకా సినిమా ఇటీవలే రూ.100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అంటే.. శ్రీలీల కూడా తొలిసారి వంద కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందన్నమాట. ధమాకా సినమా సక్సెస్ సందర్భంగా శ్రీలీల ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. నిజానికి.. బయట చాలా కూల్ గా కనిపించే శ్రీలీలకు కోపం వస్తే మాత్రం ఇక రచ్చ రచ్చేనట. తను చేసే రచ్చను చూసి తట్టుకోలేమని చెబుతోంది శ్రీలీల.

actress Sreeleela open comments about her

actress Sreeleela open comments about her

Sreeleela : కోపం వస్తే ఎవరి మీదనైనా అరిచేస్తా.. చివరకు అమ్మ అయినా సరే అంటున్న శ్రీలీల

తనకు కోపం వస్తే.. తన నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తానని, ఆ టైమ్ లో అమ్మ ఉన్నా.. ఇంకెవరు ఉన్నా వాళ్ల మీద అరిచేసి.. కోపం చల్లారాక ఎందుకు తిట్టాను అని బాధపడి ఏడుస్తా అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. అయితే.. మా అమ్మ కాబట్టి నా కోపాన్ని భరిస్తుంది కానీ.. వేరే వాళ్లు అయితే నా కోపం చూసి అక్కడి నుంచి పారిపోవాల్సిందే అంటూ తన ఒరిజినల్ బిహేవియర్ ను అందరి ముందు పబ్లిక్ గా బయటపెట్టేసింది శ్రీలీల. తను చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp