Actress Tulasi : నటి తులసి జీవితం లో ఇన్ని దారుణాలు జరిగాయా .. ఎవ్వరికీ తెలియని కోణం ఇది !
Actress Tulasi : నటి తులసి తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. తెలుగుతో పాటు వివిధ భాషల్లో బాలనటిగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా తులసికి మంచి పేరు ఉంది. దాదాపు 300 పైగా సినిమాలలో ఆమె నటించారు. శంకరాభరణం సినిమాలో మంజుల కొడుకుగా.. శంకర శాస్త్రి శిష్యుడిగా తులసి నటన ఇప్పటికీ అందరి మదిలో మెదులుతూనే ఉంటుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేసినా కాలక్రమంలో చెల్లెలు, అక్క, వదిన, అమ్మ వంటి క్యారెక్టర్లకు షిప్ట్ అయ్యింది. ఏ పాత్ర అయినా సినీ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ అనేక విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తులసి మాట్లాడుతూ .. ” బాలనటిగా ‘శంకరాభరణం’ సినిమా నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత నేను బిజీ అయ్యాను అని అన్నారు.
ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. తెలుగు సినిమాల నుంచి అవకాశాలు ఎక్కువగా వెళుతుండటం వలన, ఆమె చెన్నై నుంచి హైదరాబాదుకి షిఫ్ట్ అయ్యారు. తాజాగా తులసి మాట్లాడుతూ.. మా అమ్మగారికి మహానటి సావిత్రి గారితోను .. అంజలీదేవిగారితోను మంచి స్నేహం ఉండేది. తరచూ తనతో పాటు ఆమె నన్ను వారి ఇంటికి తీసుకుని వెళుతూ ఉండేది. అప్పుడు సావిత్రి గారు నన్ను బాలనటిగా పరిచయం చేయమని చెప్పారట. నా నటనను చూసిన సావిత్రి గారు, నేను తప్పకుండా మంచి ఆర్టిస్టును అవుతానని అమ్మతో చెప్పారట. ఆమె అలా అనడం వల్లనే అమ్మ కూడా నన్ను నటన వైపుకు నడిపించడానికి ఉత్సాహాన్ని చూపించారు.
Actress Tulasi : ఇన్ని దారుణాలా..
నా చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారికి మంచితనం ఎక్కువ. చాలామంది సినిమా వాళ్లు మా ఇంట్లో అద్దెకి ఉన్నవాళ్లే. వాళ్లు పెద్దగా రెంట్ ఇవ్వకపోయిన లైట్ తీసుకునేది. ఇంట్లో ఏం చేసిన వీధిలో అందరికి ఇచ్చేది. ఆమె మంచితనం వల్లనే ఆస్తి అంతా కూడా కరిగిపోయింది. ప్యాషన్ తో నటన వైపుకు వెళ్లిన నాకు, ఆ తరువాత నటన అవసరమైపోయింది” అంటూ చెప్పుకొచ్చారు. తన పెళ్లి అయ్యేటప్పటికి తన భర్త చాలా పేదవారని, తన అత్తగారు పాచి పని చేసేదని.. తను కోడలిగా అడుగుపెట్టాకే ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగయ్యిందని తులసి చెప్పుకొచ్చింది. ఆయన తీసిన కొన్ని సినిమాలు ఫెయిల్ కావడంతో.. వారి ఆర్థిక పరిస్థితి అంతలా దిగజారింది. అప్పలుపాలయ్యారు అని ఆమె వెల్లడించారు.