Adhire Abhi shares emotional post
Adire Abhi : జబర్దస్త్ లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వచ్చిన అదిరే అభి కొన్నాళ్ల క్రితం మానేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన స్టార్ మా లో కొనసాగుతున్నాడు. స్టార్ కమెడియన్ గా గుర్తింపు దక్కించుకున్న ఆయన ఉన్నట్లుండి జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్ళి పోయాడు అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కామెడీ స్టార్స్లో మంచి గుర్తింపు దక్కించుకుంటూ కామెడీ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అక్కడ చేస్తున్న కామెడీనే ఇక్కడ కూడా చేస్తే బాగుండేది అంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళి పోయాడు అంటూ జబర్దస్త్ అభిమానులు చర్చలు జరుపుకుంటున్నారు.
ఈ సమయంలో మల్లెమాల వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం పారితోషికం విషయంలో వివాదాలు తలెత్తడం కారణంగానే అదిరే అభి వెళ్ళి పోయాడు. అదిరే అభి టీమ్ నుండి ఎంతో మంది మంచి కమెడియన్స్ వచ్చారు. హైపర్ ఆది కూడా అదిరే అభి టీం నుండి వచ్చిన వ్యక్తే అవ్వడం అందరికి తెలిసిందే. ట్యాలెంట్ ఎక్కడ ఉన్నా గుర్తించి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఘనత కచ్చితంగా అదిరే అభి కి ఉంటుంది. అలాంటి అదిరే అభి కి జబర్దస్త్ నుండి స్వస్తి పలకడం విడ్డూరంగా ఉంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Adhire Abhi why change etv to star maa tv
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదిరే అభి పారితోషకం పెంచాలని డిమాండ్ చేశాడంటూ.. సమాచారం సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది లకు ఇచ్చినంత పారితోషికాన్ని తనకు కూడా ఇవ్వాలని అభి డిమాండ్ చేశారని అందువల్లే ఆయన్ని పొమ్మన లేక పొగ పెట్టారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లెమాల వారు పారితోషికం విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కంటెంటుని బట్టి పారితోషికం ఉంటుంది. కనుక అదిరే అభి కి ఆశించిన స్థాయిలో పారితోషికం దక్కలేదు. అందుకే ఆయన చానల్ మారాల్సి వచ్చింది అంటూ సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం స్టార్ మా లో కొనసాగుతున్న ఆయనకు మంచి పారితోషికం దకుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
Today Gold Price : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల…
This website uses cookies.