Health Benefits : చాలా మంది అధిక బరువుతో సతమతం అవుతారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వివిధ రకాల హెల్త్ డ్రింక్స్ తీసుకుంటారు. వాటితో ఒక్కో సారి శరీరంలో వేడి చేస్తూ ఉండొచ్చు. కానీ శరీరానికి చలవ చేస్తూ కొవ్వును కరిగించే ఒక మంచి హెల్త్ డ్రింక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనకి కావలసిన పదార్థం నిమ్మకాయ. జస్ట్ నిమ్మ కాయతో మంచి హెల్త్ డ్రింక్ ను తయారు చేసుకోవచ్చు.మూడు నిమ్మకాయలు తీసుకుని రెండు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిలో ఉండే విత్తనాలను తీసి పడేయాలి. తొక్కలతో సహా నిమ్మకాయను వీలైనంత మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తరువాత దానిని 15 రోజుల వరకూ ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు.
రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ నిమ్మ కాయ పేస్ట్ కలిపి తాగడం వలన శరీరంలో కొవ్వు కరిగించుకోవచ్చు. పరగడుపున ఈ డ్రింక్ తాగడం వలన శరీరంలో మెటబాలిజం రేటును పెంచుతుంది.నిమ్మకాయ నీరు శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. డీహైడ్రేషన్ కు గురికాకుండా చూస్తుంది. జీర్ణక్రియ మెరుగు పర్చడంలో తోడ్పడుతుంది. అలాగే బరువు తగ్గడాన్ని పెంచుతుంది. అయితే, కొవ్వు తగ్గే విషయంలో నిమ్మ కాయ నీరు సాధారణ నీటికి సహాయం చేస్తుంది. ఈ నిమ్మ కాయ నీటిని తయారు చేయడం చాలా ఈజీ. అలాగే అధిక కేలరీల పానీయాల కోసం తక్కువ కేలరీల ప్రత్యామ్నాయంగా ఈ నీటిని ఉపయోగించవచ్చు.
దీనికి తేనె కలిపి తీసుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగడం మంచిది.ఈ డ్రింక్ లో పూర్తిగా నిమ్మ కాయ మాత్రమే వాడడం వలన ఇది కొంచెం చేదుగా, పుల్లగా ఉంటుంది. నిమ్మ తొక్కలు బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. ఎందుకంటే అవి పెక్టిన్ అనే ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది మీకు ఎక్కువ కాలం కడుపు నిండినట్లు అనిపించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అదనంగా, నిమ్మ తొక్కలలో పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర కొవ్వును దూరంగా ఉంచుతాయి. అందుకే రోజూ ఈ డ్రింక్ తాగుతూ బరువు తగ్గడాన్ని సులభం చేసుకోవచ్చు.
Sai Pallavi : స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ఈమధ్యనే అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో…
Kashmir : సోమవారం కాశ్మీర్ లోయలో తీవ్రమైన చలిగాలులు వస్తుండటంతో దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టింది. భారత వాతావరణ శాఖ…
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా…
Jr NTR : పుష్ప 2 ప్రీమియర్ షో వల్ల మహిళ మృతికి అల్లు అర్జున్ కూడా కారణమే అని…
Jio : రిలయన్స్ జియో తన కొత్త ₹2,025 న్యూ ఇయర్ వెల్‌కమ్ ప్లాన్‌ను ప్రారంభించింది. జియో మొబిలిటీ వినియోగదారులకు…
Ys Jagan : మాజీ సీఎం జగన్ ఇప్పుడు రూటు మార్చారు. వచ్చే ఎన్నికలలో తమ సత్తా చాటాలని భావిస్తున్న…
New Ration Cards : తెలంగాణ ప్రభుత్వం పేదలకి అనేక శుభవార్తలు చెబుతుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన పేదలకు…
Chiranjeevi : సంధ్య థియేటర్ తొక్కిసలాట, మహిళ రేవతి మృతి కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు…
This website uses cookies.