Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ఎట్టకేలకు ముగిసింది. దాదాపు వంద రోజులకి పైగా సాగిన ఈ షోలో రేవంత్ విన్నర్‌గా నిలిచాడు. ముందు నుండి రేవంత్ విన్నర్ అవుతాడని అందరు అనుకోగా, అదే నిజమైంది. అయితే టాప్ 2లో ఉన్న శ్రీహాన్, రేవంత్ ల మధ్య నాగార్జున ఆఫర్‌తో ఎర వేయగా ముందుగా 25 లక్షల నుంచి స్టార్ట్ చేశారు… ఇరువురు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ముప్పై చేశాడు, అయిన ఒప్పుకోలేదు. ఫైనల్‌గా 40 లక్షలు నాగార్జున ఆఫర్ చేయడంతో శ్రీహాన్ కాస్త టెంప్ట్ అయి సూట్ కేసు అందుకున్నాడు. రేవంత్ కప్ గెలుచుకున్నాడు. అయితే విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు అనే విషయం తెలిసింది.
రన్నర్ అయిన శ్రీహాన్.. 40 లక్షలు గెలుచుకున్నాడు. ఇది చిన్నఅమౌంట్ కాదు. దీనితో సంచలనాత్మకంగా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి అంగీకరించడం దాంతో రేవంత్ కి విజయం దక్కడం జరిగింది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. అసలు విజేత శ్రీహాన్ అని నాగార్జున చివరిలో చెప్పారు. . ప్రేక్షకుల ఓట్లు రేవంత్ కంటే కాస్త ఎక్కువగా శ్రీహాన్ కి వచ్చాయట. అయితే శ్రీహాన్ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, 40 లక్షలకు టెంప్ట్ కాకుండా ఉండి ఉంటె విజేతగా నిలిచేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్కడంతో శ్రీహాన్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. కొందరు ఈ విషయంపై జోరుగా చర్చలు జరుపుతున్నారు.
టాప్ 4లో నిలిచిన ఆదిరెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. ఇండియాలో తొలి సారి ఇలా జరిగిందట. ఏదైన రూల్స్ ప్రకారం జరుగుతాయి. ఎక్కడ ఫేక్ ఉండదు. అంతా ఓట్స్ ప్రకారం జరుగుతాయని అన్నాడు. ఎలిమినేషన్ ఫేక్‌గా జరుగుతుందని కొందరు అంటుంటే దానిపై స్పందించిన ఆదిరెడ్డి మనకు బయటనుండి చూస్తే ఫేక్ అనిపిస్తుంది కాని అన్నీ కూడా పద్దతి ప్రకారమే జరుగుతాయని అన్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని బిగ్ బాస్ వేదికపై చూడడం సంతోషంగా ఉందని, తన కల నెరవేరిందని, ఈ షో తన కెరీర్‌కి ప్లస్ అయిందని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.