Bigg Boss 6 Telugu : శ్రీ‌హ‌న్ గెలుస్తాడని అంద‌రు అనుకున్నారు కానీ.. రేవంత్ గెలిచాడు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : శ్రీ‌హ‌న్ గెలుస్తాడని అంద‌రు అనుకున్నారు కానీ.. రేవంత్ గెలిచాడు త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది..!

 Authored By sandeep | The Telugu News | Updated on :19 December 2022,10:30 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6 ఎట్టకేల‌కు ముగిసింది. దాదాపు వంద రోజుల‌కి పైగా సాగిన ఈ షోలో రేవంత్ విన్న‌ర్‌గా నిలిచాడు. ముందు నుండి రేవంత్ విన్న‌ర్ అవుతాడ‌ని అంద‌రు అనుకోగా, అదే నిజ‌మైంది. అయితే టాప్‌ 2లో ఉన్న శ్రీహాన్‌, రేవంత్‌ ల మధ్య నాగార్జున ఆఫర్‌తో ఎర వేయ‌గా ముందుగా 25 లక్షల నుంచి స్టార్ట్ చేశారు… ఇరువురు ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత ముప్పై చేశాడు, అయిన ఒప్పుకోలేదు. ఫైన‌ల్‌గా 40 ల‌క్ష‌లు నాగార్జున ఆఫ‌ర్ చేయ‌డంతో శ్రీహాన్ కాస్త టెంప్ట్ అయి సూట్ కేసు అందుకున్నాడు. రేవంత్ క‌ప్ గెలుచుకున్నాడు. అయితే విన్నర్ కి 50 లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు అనే విష‌యం తెలిసింది.

ర‌న్న‌ర్ అయిన శ్రీహాన్.. 40 లక్షలు గెలుచుకున్నాడు. ఇది చిన్నఅమౌంట్ కాదు. దీనితో సంచలనాత్మకంగా బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా శ్రీహాన్ 40 లక్షల ఆఫర్ కి అంగీకరించ‌డం దాంతో రేవంత్ కి విజయం దక్కడం జ‌రిగింది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే.. అసలు విజేత శ్రీహాన్ అని నాగార్జున చివ‌రిలో చెప్పారు. . ప్రేక్షకుల ఓట్లు రేవంత్ కంటే కాస్త ఎక్కువగా శ్రీహాన్ కి వచ్చాయట. అయితే శ్రీహాన్ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, 40 లక్షలకు టెంప్ట్ కాకుండా ఉండి ఉంటె విజేతగా నిలిచేవాడు. కానీ 40 లక్షలు తీసుకుని తప్పుకోవడంతో రేవంత్ కి ఆ విజయం దక్క‌డంతో శ్రీహాన్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. కొంద‌రు ఈ విష‌యంపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Adi Reddy C0MMENTS On Bigg Boss 6 Telugu Winner Revanth And Srihan

Adi Reddy C0MMENTS On Bigg Boss 6 Telugu Winner Revanth And Srihan

 

Bigg Boss 6 Telugu : మ‌న‌సులు గెలిచాడు..!

టాప్ 4లో నిలిచిన ఆదిరెడ్డి కూడా ఈ విష‌యంపై స్పందించారు. ఇండియాలో తొలి సారి ఇలా జ‌రిగింద‌ట‌. ఏదైన రూల్స్ ప్ర‌కారం జ‌రుగుతాయి. ఎక్క‌డ ఫేక్ ఉండ‌దు. అంతా ఓట్స్ ప్ర‌కారం జ‌రుగుతాయ‌ని అన్నాడు. ఎలిమినేష‌న్ ఫేక్‌గా జ‌రుగుతుంద‌ని కొంద‌రు అంటుంటే దానిపై స్పందించిన ఆదిరెడ్డి మ‌న‌కు బ‌య‌ట‌నుండి చూస్తే ఫేక్ అనిపిస్తుంది కాని అన్నీ కూడా ప‌ద్ద‌తి ప్ర‌కార‌మే జ‌రుగుతాయ‌ని అన్నారు. త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రిని బిగ్ బాస్ వేదిక‌పై చూడ‌డం సంతోషంగా ఉంద‌ని, త‌న క‌ల నెర‌వేరింద‌ని, ఈ షో త‌న కెరీర్‌కి ప్ల‌స్ అయింద‌ని చెప్పుకొచ్చాడు ఆదిరెడ్డి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది