
Adipurush Trailer : అబ్బబ్బ.. ఒక సినిమా రిలీజ్ కు కూడా ఇంత హడావుడి ఉండదు కాబోలు. అసలే అక్కడ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన సినిమా అంటే మామూలుగా ఉండదు. టీజర్, ట్రైలర్లకే థియేటర్లు బద్దలు అయిపోవాల్సిందే. అవును మరి.. ఆదిపురుష్ ట్రైలర్ విడుదల కాకముందే అభిమానుల కోసం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ స్క్రీనింగ్ కు ఏకంగా ప్రభాస్ రావడంతో ఇక ఏఎంబీ మాల్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.
Adipurush movie Trailer public-talk
త్రీడి వెర్షన్ లో కళ్లద్దాలతో ఆదిపురుష్ ట్రైలర్ ను తన అభిమానుల మధ్య ప్రభాస్ కూడా వీక్షించారు. ప్రభాస్ రావడం వల్ల స్క్రీనింగ్ కూడా లేట్ అయింది. మీడియాను అస్సలు అనుమతించలేదు. ఏది ఏమైనా.. షో లేట్ అయినా ప్రభాస్ అభిమానులు ట్రైలర్ చూడటానికి గంటలు గంటలు వెయిట్ చేశారు. ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 20 సెకన్లు ఉంది. ట్రైలర్ లో రావణుడు సీతను అపహరించడం చూపిస్తారు. ఆ తర్వాత రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం కూడా ఉంటుంది. ఆ తర్వాత రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్ ను ముగించారు.
ఇక ట్రైలర్ ఓవరాల్ గా ఎలా ఉందంటే.. అద్భుతం అని చెప్పుకోవాలి. విజువల్స్ అదుర్స్ అని చెప్పుకోవాలి. టీజర్ చూసినప్పుడు ఎంత నెగెటివిటీ వచ్చిందో ట్రైలర్ చూశాక ఇప్పుడు అంత పాజిటివిటీ వచ్చేసింది. సూపర్బ్ గా ఉంది అంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ లుక్స్ అయితే ఇక అదుర్స్ అంటున్నారు. అసలు అందరూ ఊహించిన దాని కంటే పది రెట్లు ఎక్కువే ఉందంటున్నారు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మాత్రం ఎక్కువయ్యాయి.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.