Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Adipurush Trailer : ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ !

Adipurush Trailer : అబ్బబ్బ.. ఒక సినిమా రిలీజ్ కు కూడా ఇంత హడావుడి ఉండదు కాబోలు. అసలే అక్కడ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన సినిమా అంటే మామూలుగా ఉండదు. టీజర్, ట్రైలర్లకే థియేటర్లు బద్దలు అయిపోవాల్సిందే. అవును మరి.. ఆదిపురుష్ ట్రైలర్ విడుదల కాకముందే అభిమానుల కోసం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ స్క్రీనింగ్ కు ఏకంగా ప్రభాస్ రావడంతో ఇక ఏఎంబీ మాల్ లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 May 2023,11:00 am

Adipurush Trailer : అబ్బబ్బ.. ఒక సినిమా రిలీజ్ కు కూడా ఇంత హడావుడి ఉండదు కాబోలు. అసలే అక్కడ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఆయన సినిమా అంటే మామూలుగా ఉండదు. టీజర్, ట్రైలర్లకే థియేటర్లు బద్దలు అయిపోవాల్సిందే. అవును మరి.. ఆదిపురుష్ ట్రైలర్ విడుదల కాకముందే అభిమానుల కోసం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేశారు. ఈ స్క్రీనింగ్ కు ఏకంగా ప్రభాస్ రావడంతో ఇక ఏఎంబీ మాల్ లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు.

Adipurush movie Trailer public talk

Adipurush movie Trailer public-talk

త్రీడి వెర్షన్ లో కళ్లద్దాలతో ఆదిపురుష్ ట్రైలర్ ను తన అభిమానుల మధ్య ప్రభాస్ కూడా వీక్షించారు. ప్రభాస్ రావడం వల్ల స్క్రీనింగ్ కూడా లేట్ అయింది. మీడియాను అస్సలు అనుమతించలేదు. ఏది ఏమైనా.. షో లేట్ అయినా ప్రభాస్ అభిమానులు ట్రైలర్ చూడటానికి గంటలు గంటలు వెయిట్ చేశారు. ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 20 సెకన్లు ఉంది. ట్రైలర్ లో రావణుడు సీతను అపహరించడం చూపిస్తారు. ఆ తర్వాత రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం కూడా ఉంటుంది. ఆ తర్వాత రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్ ను ముగించారు.

Adipurush Trailer : విజువల్స్ మాత్రం అదిరిపోయాయి

ఇక ట్రైలర్ ఓవరాల్ గా ఎలా ఉందంటే.. అద్భుతం అని చెప్పుకోవాలి. విజువల్స్ అదుర్స్ అని చెప్పుకోవాలి. టీజర్ చూసినప్పుడు ఎంత నెగెటివిటీ వచ్చిందో ట్రైలర్ చూశాక ఇప్పుడు అంత పాజిటివిటీ వచ్చేసింది. సూపర్బ్ గా ఉంది అంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ లుక్స్ అయితే ఇక అదుర్స్ అంటున్నారు. అసలు అందరూ ఊహించిన దాని కంటే పది రెట్లు ఎక్కువే ఉందంటున్నారు. ఈ సినిమా జూన్ 16న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా ఆదిపురుష్ సినిమాపై అంచనాలు మాత్రం ఎక్కువయ్యాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది