Jabardasth Faima : ఈటీవీ ప్లస్ లో ప్రసారం అయిన పటాస్ కార్యక్రమంలో ఒక ఎపిసోడ్ కోసం స్టూడెంట్ గా వెళ్లిన ఫైమా అనూహ్యంగా అక్కడి వారి దృష్టిలో పడింది. దాంతో పటాస్ లో ఒక కంటెస్టెంట్ గా ఎంపిక అయింది. అక్కడి నుండి ఆమె ప్రస్థానం గా కొనసాగుతూ వస్తోంది, పటాస్ కార్యక్రమం ఆపివేసిన కూడా ఆమె యొక్క జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. పటాస్ కార్యక్రమం లో ఆమె సాధించిన విజయాలు ఆమె నవ్వించిన తీరు కారణంగా జబర్దస్త్ కార్యక్రమంలోకి ఆమెను తీసుకున్న విషయం తెలిసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఆమె తన కామెడీని పండించింది. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ నుండి ఆఫర్ రావడంతో ఫైమా వెళ్లి పోయింది.
సాధారణంగా అయితే ఈటీవీ, మల్లెమాల ని వదిలేసిన వారికి మళ్లీ రీఎంట్రీ ఉండదు. కానీ ఈ అమ్మాయికి రీ ఎంట్రీ ఇచ్చేందుకు మల్లెమాల వారు ఓకే చెప్పారట. స్టార్ మా మరియు బిగ్ బాస్ నిర్వహకులతో ఉండే ఒప్పందం పూర్తయిన తర్వాత జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మల్లెమాల వారు ఫైమా కి ఓకే చెప్పారని.. అందుకోసమే ఫైమా వెళ్లిపోయింది అంటూ ఈటీవీ కి చెందిన కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎంతో మంది మల్లెమాల మీ వదిలేసి వెళ్లి పోయారు. వారిలో చాలా మంది వెనక్కు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బతిమిలాడారు.. దండం పెట్టారు. అయినా కూడా వారిని కనికరించకుండా మల్లెమాల దూరం పెట్టింది.
ఒక్కసారి మల్లెమాల గేటు దాటిన వాళ్లు మళ్లీ లోనికి రావాలంటే ఖచ్చితంగా కాళ్లు పైకి తల కిందికి పెట్టాలి అన్నట్లుగా కొందరిలో అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయం మెల్ల మెల్లగా తగ్గేలా మల్లెమాల వారు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ వీడి పోయి ఇతర ఛానల్లో బిజీ అయిన వారికి కూడా ఈటీవీలో ఛాన్స్ ఇస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో చమ్మక్ చంద్ర రావడంతో మల్లెమాల వారి లో మార్పు వచ్చింది అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ లో మళ్ళీ ఫైమా వస్తే బాగుంటుందని ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అంత భావిస్తున్నారు. అలాగే మల్లెమాల వారు కూడా అందుకు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. ఇది నిజమైతే కచ్చితంగా ఫైమా అభిమానులకు గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.