Home » Entertainment » After Jayamma Panchayithi Movie Anchor Suma Quit Cash Show
Entertainment

Anchor Suma : జయమ్మ పంచాయితీ సక్సెస్ అయితే యాంకర్‌ సుమ ‘క్యాష్‌’ వదిలేస్తుందా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: May 4, 2022, 9:00 pm
Advertisement

Anchor Suma : యాంకర్‌ సుమ నటి సుమగా మారింది. జయమ్మ పంచాయితీ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. సుమ గతంలో నటిగా బుల్లి తెర మరియు వెండి తెరపై పలు సినిమాల్లో కనిపించింది. ఆ విషయంలో చాలా మందికి తెలియదు. ఆమె ను ఇప్పటి యూత్ చిన్నప్పటి నుండి కూడా టీవీలోనే చూశారు. ఇప్పుడు వారు వెండి తెరపై ఆమెను చూడబోతున్నారు. జయమ్మ పంచాయితీ సినిమా తో సుమ వెండి తెరపై సూపర్‌ క్రేజ్ తో అరంగేట్రంకు సిద్దం అయ్యింది.సుమ వయసుకు తగ్గ పాత్ర తో జయమ్మ పాత్రలో కనిపించబోతుంది.

Advertisement

సినిమాలో ఆమె ఒక పల్లెటూరుకు చెందిన మహిళగా కనిపించబోతుంది. జయమ్మ పంచాయితీ సినిమా సక్సెస్ అయితే ఆమెతో నటించేందుకు చాలా మంది స్టార్‌ హీరోలు సిద్దంగా ఉన్నారు. ఆమెకు తమ సినిమాల్లో కీలక పాత్రలను ఆఫర్‌ చేస్తూ చాలా మంది క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమె కనుక ఓకే అనాలే కాని ఒకే సారి పది సినిమాల ఆఫర్‌ లు ఆమె ముందు ఉండే అవకాశాలు లేకపోలేదు.సుమ కు ఒక స్టార్‌ హీరో హీరోయిన్‌ రేంజ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

after jayamma panchayithi movie Anchor Suma quit cash show

Advertisement

అలాంటి సుమ నటిగా బిజీ అయితే ఆమె చేస్తున్న కార్యక్రమాల పరిస్థితి ఏంటీ అంటూ ఇప్పుడు అభిమానుల్లో చర్చ మొదలు అయ్యింది. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న క్యాష్ కార్యక్రమం జయమ్మ పంచాయితీ సినిమా తర్వాత కనిపించకుండా పోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ షో కు ఇప్పటికి మంచి ఆధరణ ఉంది. సెలబ్రెటీలతో సుమ చేసే సందడిని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాంటి షో ను సుమ మానేసి సినిమాలతో బిజీ అవుతుందనే పుకార్లు వస్తున్నాయి. కాని సుమ అభిమానులు మాత్రం ఆ వార్తలను కొట్టి పారేస్తున్నారు. సుమ మరో పదేళ్ల పాటు ఆ షో చేస్తుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి