
Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ కపూర్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..!
Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కి అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్ సక్సెస్‌ను అందుకోలేక పోయిన జాన్వీ.. ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ కపూర్.. అమ్మడి క్రేజ్ మాములుగా లేదుగా..!
‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటించిన జాన్వీ కపూర్.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC 16’ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న జాన్వీ లక్ మామూలుగా లేదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించే ఛాన్స్ ఈ బ్యూటీ దక్కించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియదు కానీ.. అట్లీ ప్రాజెక్ట్ లైనప్ లో ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ను ఎంపిక చేసారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే నిజమైతే వరుసగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నిలవనుంది.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.