Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

 Authored By ramu | The Telugu News | Updated on :19 April 2025,5:20 pm

ప్రధానాంశాలు:

  •  Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor : టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్‌కి అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. హిందీలో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్‌గా బిగ్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయిన జాన్వీ.. ఈ చిత్రంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

Janhvi Kapoor టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్ అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా

Janhvi Kapoor : టాలీవుడ్‌ని దున్నేస్తున్న జాన్వీ క‌పూర్.. అమ్మ‌డి క్రేజ్ మాములుగా లేదుగా..!

Janhvi Kapoor జాన్వీ క్రేజ్..

‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్‌ కు జోడీగా నటించిన జాన్వీ కపూర్‌.. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘RC 16’ సినిమాలో రామ్‌ చరణ్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో బ్యాక్ టు బ్యాక్‌ సినిమాల్లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న జాన్వీ లక్‌ మామూలుగా లేదని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన నటించే ఛాన్స్ ఈ బ్యూటీ దక్కించుకుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

అల్లు అర్జున్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ ఓ సినిమా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియదు కానీ.. అట్లీ ప్రాజెక్ట్ లైనప్ లో ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ ను ఎంపిక చేసారని రూమర్స్ వస్తున్నాయి. ఇదే నిజమైతే వరుసగా జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి ముగ్గురు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలతో నటించిన హీరోయిన్ గా జాన్వీ కపూర్ నిలవనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది