Telugu Indian Idol : క్లైమాక్స్ చేరిన తెలుగు ఇండియన్ ఐడల్.. హిట్టా? ఫట్టా?
Telugu Indian Idol : సింగింగ్ కాంపిటీషన్ అనగానే చాలా మందికి టక్కున గుర్తుకు వచ్చే కార్యక్రమం పేరు ఇండియన్ ఐడల్. దేశ వ్యాప్తంగా ఎంతో మంది గాయినీ గాయకులను వెలికి తీసిన షో ఇండియన్ ఐడల్. ఆ ఇండియన్ ఐడల్ ను పలు రాష్ట్రాల్లో తమ తమ స్థానిక భాషల్లో నిర్వహించడం జరిగింది. ఎక్కడ కూడా హిందీ లో సక్సెస్ అయినట్లుగా సక్సెస్ అవ్వలేక పోయారు. తాజాగా తెలుగు లో కూడా ఇండియన్ ఐడల్ కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే తెలుగు ఇండియన్ ఐడల్ ను ఓటీటీ ద్వారా అది కూడా ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈమద్య ఓటీటీకి ఆధరణ భారీగా పెరిగింది. కాని తెలుగు ఇండియన్ ఐడల్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే స్థాయిలో మాత్రం ఆహాకు ఇక్కడ ఆధరణ పెరగలేదు అనేది చాలా మంది అభిప్రాయం. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ ఐడల్ లో జడ్జ్ గా వ్యవహరించిన థమన్ కూడా షో కు వచ్చిన ఆధరణ విషయంలో సంతృప్తిగా లేడట. అందుకే తదుపరి సీజన్ కు ఆయన నో చెప్పేశాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చాలా రోజులుగా ఆహా వారు ఎంత ప్రమోషన్ చేసినా కూడా అంతగా మాత్రం తెలుగు ఇండియన్ ఐడల్ ఆకట్టుకోలేక పోయింది.

aha ott telugu indian idol singing Competition hit or fut
తెలుగు ఇండియన్ ఐడల్ క్లైమాక్స్ కు చెరింది. బాలకృష్ణ ఆహా లో గతంలో అన్ స్టాపబుల్ షో ను చేయడం జరిగింది. ఆ కారనంగా తెలుగు ఇండియన్ ఐడల్ యొక్క క్లైమాక్స్ ఎపిసోడ్స్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అంతే కాకుండా అఖండ సక్సెస్ ను అందించిన థమన్ ఆహ్వానం మేరకు కూడా బాలయ్య తెలుగు ఇండియన్ ఐడల్ యొక్క గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో పాల్గొన్నాడు. ఆరుగురు ఫైనలిస్ట్ ల పాటలు విని చివరకు ఎవరు విజేత అనే విషయాన్ని బాలయ్య నిర్ణయించి.. వారికి తెలుగు ఇండియన్ ఐడల్ షీల్డ్ ను ఇవ్వబోతున్నారు. షో పూర్తి అయ్యే టైమ్ కు తెలుగు ఇండియన్ ఐడల్ నిరాశ పర్చింది అనే విషయం పై ఒక క్లారిటీ వచ్చేసింది.