Aishwarya – Danush : ఐశ్వర్య ధనుష్ కలువడం వాస్తవమేనా.. ఇదిగో క్లారిటీ?
Aishwarya – Danush : సినిమా ఇండస్ట్రీలో ప్రేమవివాహాలు, విడాకులు తీసుకోవడం కొందరికి కామన్ అయిపోయింది. ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా చిన్న చిన్న కారణాలు చెప్పి విడిపోవాలని చూస్తున్నారు. కానీ కొందరు మాత్రం తమ పిల్లల కోసం కాంప్రమైజ్ అవుతున్నారు. అటువంటి కోవలోకి చెందిన వారే తమిళ సూపర్ స్టార్ ధనుష్, ఐశ్యర్య.. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా మళ్లీ కలిసిపోయారని కథనాలు వెలువడుతున్నాయి.
ఐశ్యర్య సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు అని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. వీరిద్దరూ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పుడే ధనుష్ ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న సమయం. రజినీకాంత్ కూడా ఆ టైంలో స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు. ఇక ఐశ్యర్య ధనుష్ ప్రేమించుకోవడంతో రజినీకాంత్ వారి పెళ్లికి అడ్డుచెప్పకుండా వివాహం జరిపించారు. సుదీర్ఘకాలం వరకు కలిసే ఉన్న వీరిద్దరూ అనుకోకుండా విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్టు ఐశ్యర్య ధనుష్ ప్రకటించారు. ఈ న్యూస్ తెలిసి ఒక్కసారిగా అంతా షాకయ్యారు. ముందుగా ఈ ప్రపోజల్ పెట్టింది ఐశ్యర్య అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
Aishwarya – Danush : నిజంగానే ఈ జంట కలిసిపోయిందా..
అయితే,ఆరు నెలల అనంతరం మరల వీరు విడాకులు తీసుకునేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. పెద్దల సమక్షంలో వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడం వలన పిల్లల కోసం డ్రాప్ అయ్యారని తెలుస్తోంది. కాగా, ఐశ్యర్య ధనుష్ నిజంగానే కలిసి పోయారా? అనేదానిపై అనేక కథనాలు వెలువడ్డాయి. కానీ దీనిపై ధనుష్, ఐశ్వర్య ఏ ఒక్కరూ సరిగా స్పందించలేదు. వీరి నుంచి గానీ, అటు వీరి కుటుంబం నుంచి గానీ అధికారికంగా ప్రకటన మాత్రం వెలువడలేదు. దీంతో ధనుష్, ఐశ్యర్య నిజంగానే ఒక్కటయ్యారా? అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అటు ధనుష్ ఫ్యామిలీ, ఇటు రజినీకాంత్ రంగంలోకి దిగడంతో ఐశ్యర్య పిల్లల కోసం తన నిర్ణయాన్ని మార్చుకుందని తెలుస్తోంది.