
akhi -not responds to samantha
Samantha : అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్నాక సమంత నిత్యం వార్తలలో నిలుస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు మరోవైపు సోషల్ మీడియాలో పోస్ట్‌లతో తెగ రచ్చ చేస్తుంది. సాధారణంగా పెళ్లి, విడాకుల తర్వాత హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావు. పైగా క్రేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అయితే సమంత విషయంలో ఇవన్నీ రివర్స్ అయిపోయాయి. పెళ్లి చేసుకున్నాకే రంగస్థలం లాంటి సినిమాతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. పెళ్లయ్యాక భర్తతో చేసిన మజిలీ సూపర్ హిట్. ఇక విడాకులు తీసుకున్నాకే పుష్ప సినిమాలో ఊ అంటావా మావ సాంగ్ ఎంత రచ్చ రంబోలో చేసి.. సమంత ఎంత క్రేజ్ సంపాదించిందో మనం చూశాం. విడాకుల తర్వాత నుండి సమంతలో మార్పులు చూశాం. ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది.
నిన్న(ఏప్రిల్9)న అఖిల్ బర్త్‌డే సందర్భంగా సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కేలని దేవుడ్ని కోరుకుంటున్నా’ అంటూ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే సమంత పోస్ట్‌పై అఖిల్ స్పందించలేదు. మరోవైపు అల్లు అర్జున్‌కి కూడా సమంత బర్త్ డే విషెస్ తెలియజేసింది. సమంత .. చైతూతో తప్ప అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులతో సన్నిహితంగానే ఉంటుంది. ఇక ఈ అమ్మడు పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ.. సూపర్ హిట్‌లను ఖాతాలో వేసుకుంటోంది.ప్రస్తుతం సమంత చేతిలో ఉన్న రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. అందులో ఒకటి ‘యశోద’. ఈ మూవీ రిలీజ్ డేట్‌పై ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.
akhi -not responds to samantha
సమంత క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. ఒకవైపు సినిమాలతో, మరోవైపు బ్రాండ్ యాడ్‌లతో బిజీగా గడిపేస్తోంది. సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్‌లో కూడా సమంత అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం సామ్.. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో యశోద షూటింగ్‌తో బిజీగా ఉంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న యశోద మూవీ ఆగస్ట్ 12న విడుదల కానుంది. అయితే ఇదే తేదీలో అక్కినేని హీరోల సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉండడం హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని పెద్దోడు నాగచైతన్య తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా ఆగస్ట్ 12నే విడుదల కానుంది. అంతే కాకుండా అఖిల్ ‘ఏజెంట్’ను ఇదే తేదీకి విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.