Anasuya : బుల్లితెరపై టీఆర్పీల కోసం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంటారు. లేని పోనీ ట్రాకులు, కథలు అల్లి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తెరపైకి కొత్త కొత్త ప్రేమ పక్షులను తీసుకొస్తారు. వారి మధ్య ఏదో ఉందనేలా స్కిట్లు, ఎడిట్లు చేస్తారు. ఎమోషన్‌ను పండిస్తుంటారు. అలా కొన్ని రోజులు బాగానే సాగింది. ఇలాంటి ట్రిక్కులు ఎక్కువగా మల్లెమాల టీం చేస్తుంటుంది.ఒకప్పుడు లవ్ ట్రాకులు అంటూ బాగానే హల్చల్ చేసింది మల్లెమాల. ఆ తరువాత మెల్లిగా ఈట్రాకుల అసలు గుట్టు అందరికీ అర్థమైంది.
అందుకే స్టేజ్ మీద అలాంటి నాటకాలకు తెరదించారు. కాంట్రవర్సీల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. స్టేజ్ మీదే తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేశారు. అవి కూడా కొన్ని రోజులు వర్కవుట్ అయ్యాయి. ప్రోమోల కోసం ఏదో సెన్సేషన్ జరిగినట్టు చూపించేవారు.తీరా ఎపిసోడ్ చూస్తే అసలు కథ వేరేలా ఉంటుంది. అయితే ఈ మధ్య ఎమోషన్ మీద పడ్డారు. ప్రతీ ప్రోమోలో కచ్చితంగా ఎవరినో ఒకరిని ఏడిపించేస్తున్నారు. సందర్భం లేకపోయినా కూడా ప్రోమోలో ఏడిపించినట్టు చూపిస్తున్నారు. తీరా ఎపిసోడ్ చూస్తే అందులో ఏమీ ఉండదు.
గత వారం కూడా ఇలానే రష్మీ మీద ఓ ప్రోమోను ప్లాన్ చేశారు. అందులో రష్మీ తెగ ఏడ్చినట్టు చూపించారు.ఇక ఇప్పుడు అనసూయను కూడా వాడేశారు. ఈటీవీ శ్రీరామ నవమి పండుగ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి అనే ఈవెంట్ రాబోతోంది. తాజాగా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇందులో మొదట్లో అనసూయ బాగానే ఎంజాయ్ చేసింది. కానీ చివర్లో మాత్రం ఏడుస్తున్నట్టుగా ప్రోమోను కట్ చేశారు. ఇదంతా చూసిన జనాలు యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్నారు. ఇలాంటివి ఎన్ని చూడలేదు.. ఇకనైనా ఆపురా బాబు అని కామెంట్లు పెడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.