Akhil Akkineni : అసలే ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి బాధల్లో ఉన్న అఖిల్ కి మరొక పిడుగు లాంటి బ్రేకింగ్ న్యూస్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Akhil Akkineni : అసలే ఏజెంట్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యి బాధల్లో ఉన్న అఖిల్ కి మరొక పిడుగు లాంటి బ్రేకింగ్ న్యూస్ !

Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన అఖిల్… మోస్ట్ టాలెంట్స్ క్వాలిటీస్ ఉన్నా సరైన విజయం వరించడం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పరిచయమైన హీరోలలో ఏ హీరో చేయని రీతిలో డాన్స్… ఫైట్స్ చేస్తున్నా కానీ… దానికి తగ్గ విజయం మాత్రం అఖిల్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన “ఏజెంట్” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. “ఏజెంట్” సినిమా ఖచ్చితంగా […]

 Authored By sekhar | The Telugu News | Updated on :3 May 2023,6:00 pm

Akhil Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన అఖిల్… మోస్ట్ టాలెంట్స్ క్వాలిటీస్ ఉన్నా సరైన విజయం వరించడం లేదు. అక్కినేని ఫ్యామిలీ నుండి ఇప్పటివరకు పరిచయమైన హీరోలలో ఏ హీరో చేయని రీతిలో డాన్స్… ఫైట్స్ చేస్తున్నా కానీ… దానికి తగ్గ విజయం మాత్రం అఖిల్ అందుకోలేకపోతున్నాడు. ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన “ఏజెంట్” భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Akhil Akkineni is pain after the movie Agent is an utter flop

Akhil Akkineni is pain after the movie Agent is an utter flop

“ఏజెంట్” సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని అఖిల్ ఎంతో నమ్మకంగా చాలా కాన్ఫిడెన్స్ తో… విడుదలవకముందు ఉన్నాడు. ప్రమోషన్ కార్యక్రమాల్లో అందరికంటే అఖిల్ యే చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. “ఏజెంట్” సినిమా తర్వాత ఏ సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంటుందని చాలా పెద్ద పెద్ద డైలాగులు.. వేశాడు. తీరా “ఏజెంట్” సినిమా ఫలితం చూస్తే అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమా నిర్మాతలు భారీ నష్టాలు బాట పట్టారు. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర.. సినిమా పరాజయం ఫాలో అయిందని స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించాడు.

Akhil Akkineni is pain after the movie Agent is an utter flop

Akhil Akkineni is pain after the movie Agent is an utter flop

దీనికి కారణం తామే అని ఒప్పుకున్నారు. పరిస్థితి ఇలా ఉంటే సినిమా ఫ్లాప్ అయ్యి బాధల్లో ఉన్న అఖిల్ కి మరో పిడుగు లాంటి బ్రేకింగ్ న్యూస్.. అదేమిటంటే “ఏజెంట్” విడుదలయి నెలరోజులు అవ్వకముందే…ఓటిటిలో విడుదల చేసేస్తున్నారు. మే 19 వ తారీకు నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఫాన్సీ ధరకే సోనీ లివ్ అన్ని భాషలకు సంబంధించిన రైట్స్ సొంతం చేసుకోవడం జరిగింది. నాలుగు రోజుల్లోనే కంప్లీట్ గా “ఏజెంట్” కలెక్షన్స్ డ్రాప్ అయిపోవటంతో నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది