Naga Chaitanya : నాగ చైతన్య రెండవ పెళ్లి.. అఖిల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Naga Chaitanya : నాగ చైతన్య రెండవ పెళ్లి.. అఖిల్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :2 December 2022,7:00 pm

Naga Chaitanya : చూడచక్కని జంట అంటూ అంతా మాట్లాడుకుంటూ ఉండగా నాగ చైతన్య మరియు సమంత ల యొక్క జోడీగా ఎవరి దిష్టి తగిలిందో కానీ పాపం వారు విడి పోయారు. ఎవరి కారణంగా విడాకులు తీసుకున్నారు.. ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని కలిసి జీవితం సాగించడం అసాధ్యం అనే నిర్ణయానికి వచ్చారు కనుక విడి పోవడం అనేది మంచి నిర్ణయమే. విడిపోయిన తర్వాత లైఫ్ ను సాఫీగా తీసుకు వెళ్లే వారు బెస్ట్‌ అన్నట్లుగా అనుభవంతో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సమంత మరియు నాగ చైతన్య విడి పోయినా కూడా ఎవరి జీవితంలో వారు సంతోషంగా సాగితే వారు తీసుకున్న విడాకులకు ఒక అర్థం అంటూ ఉంటుంది. కనుక విడి పోయిన నాగ చైతన్య మరియు సమంత మరోసారి చక్కని జీవిత భాగస్వామిని చూసుకుని పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. మరో పెళ్లి అనేది తప్పు కాదని.. జీవితంలో ఒక మంచి తోడు ఎవరికి అయినా అవసరం, కనుక తప్పకుండా పెళ్లి చేసుకోవడం అనేది మంచి నిర్ణయం అవుతుంది అంటూ నాగ చైతన్య యొక్క సోదరుడు అఖిల్‌ ఆ మధ్య వ్యాఖ్యలు చేశాడు. నాగ చైతన్య మరియు సమంత ల యొక్క రెండవ పెళ్లి

akhil interesting comments about Naga Chaitanya And Samantha Second Marriage

akhil interesting comments about Naga Chaitanya And Samantha Second Marriage

గురించి పదే పదే చర్చలు జరుగుతున్నాయి. నాగ చైతన్య హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని.. ఆమెను వివాహం చేసుకోవడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరో వైపు సమంత కూడా రెండవ పెళ్లి ఆలోచనలో ఉందని.. ప్రస్తుతం మయో సైటిస్ అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత భవిష్యత్తులో తప్పకుండా ఒక మంచి తోడు కోసం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని ఆమె సన్నిహితులు అంటున్నారు. తనను తన కెరీర్ ను అర్థం చేసుకునే వారి కోసం సమంత వెయిట్‌ చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి