Most Eligible Bachelor : ‘ఆహా’లో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Most Eligible Bachelor : ‘ఆహా’లో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..

Most Eligible Bachelor : అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్‌కు సరియైన హిట్ సినిమా ఇంత వరకు పడలేదు. కాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతున్నది. ఈ చిత్రం ద్వారా అఖిల్‌కు హిట్ లభించిందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. కాగా ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమ్ కాబోతున్నదన్న వార్త ఒకటి సోషల్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :17 October 2021,4:05 pm

Most Eligible Bachelor : అక్కినేని నాగార్జున వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్‌కు సరియైన హిట్ సినిమా ఇంత వరకు పడలేదు. కాగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ఈ నెల 15న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగిపోతున్నది. ఈ చిత్రం ద్వారా అఖిల్‌కు హిట్ లభించిందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. కాగా ఈ సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమ్ కాబోతున్నదన్న వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయమై మేకర్స్ క్లారిటీనిచ్చారు.అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

akhil most eligible bachelor film not straeming on aha

akhil most eligible bachelor film not straeming on aha

ఇకపోతే ఈ సినిమా అప్పుడే ఓటీటీలో విడుదల చేయడం లేదని, ప్రొడ్యూసర్ శ్రీనివాస కుమార్ (ఎస్‌కెఎన్) క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెల 12న చిత్రం ‘ఆహా’ స్ట్రీమ్ అవుతుందన్న విషయంలో నిజం లేదని స్పష్టతనిచ్చారు. ఈ చిత్రంలో అఖిల్, పూజా హెగ్డే కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అవుట్ అయిందని, వీరి మధ్య రొమాన్స్ సినిమాలో హైలైట్‌గా నిలిచిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రంలో‌నూ బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా ద్వారా అఖిల్ కెరీర్ సెట్ అయిందని, సాలిడ్ హిట్ అఖిల్ ఖాతాలో నమోదైందని సినీ పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ దుమ్ము రేపాయి.

Most Eligible Bachelor : బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’మూవీ..

akhil most eligible bachelor film not straeming on aha

akhil most eligible bachelor film not straeming on aha

సినిమా ఏకంగా 5.45 కోట్ల రేంజ్ షేర్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగాను ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ అందుకుంటుందని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఇకపోతే అఖిల్ తన నెక్స్ట్ మూవీ సక్సెస్ ఫుల్ అండ్ సూపర్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా, ఈ ‘ఏజెంట్’ మూవీ కోసం అఖిల్ బాడీ కూడా బిల్డ్ చేశాడు. ఈ ఫిల్మ్‌ను ఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, సురేందర్ రెడ్డి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కొత్త అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కానుంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది