Samantha : నాగ చైతన్య కంటే అఖిల్ బెటర్.. సమంత వ్యాధి గురించి తెలిసి ఫారెన్ డాక్టర్ ని దింపాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నాగ చైతన్య కంటే అఖిల్ బెటర్.. సమంత వ్యాధి గురించి తెలిసి ఫారెన్ డాక్టర్ ని దింపాడు

 Authored By sandeep | The Telugu News | Updated on :30 October 2022,7:40 pm

Samantha : స్టార్ హీరోయిన్ స‌మంత శ‌నివారం రోజు త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న వార్త‌ల గురించి క్లారిటీ ఇచ్చింది. వయోసైటిస్‌ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్‌మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సమంత కాస్మోటిక్‌ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఇటీవలే ఓ యాడ్‌ షూట్‌లో భాగంగా రిలీజైన ఫోటోలు కూడా మార్పులు కనిపించడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ స‌మ‌యంలో స‌మంత త‌న‌కు వ‌యోసైటిస్ అని ప్ర‌క‌టించ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. స‌మంత పోస్ట్‌పై చిరంజీవి,జూ.ఎన్టీఆర్‌, రాశీఖన్నా, జాన్వీ కపూర్‌ ఇలా పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు.

స‌మంత మాజీ మ‌రింది అక్కినేని అఖిల్ కూడా స‌మంత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని పోస్ట్ పెట్టారు. ‘అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి డియర్‌ సామ్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున గానీ, నాగచైతన్య గానీ ఈ విషయంపై స్పందించలేదు. నాగ చైత‌న్య సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నేప‌థ్యంలో ఇంకా స్పందించ‌లేద‌ని, డైరెక్ట్‌గా వెళ్లి స‌మంత‌ని పరామ‌ర్శిస్తాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అయితే ప్ర‌స్తుతానికి అఖిల్ ఒక్క‌డు మాత్ర‌మే స్పందించ‌డంతో నెటిజ‌న్స్.. నాగా చైత‌న్య క‌న్నా అఖిల్ బెట‌ర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఈ విష‌యంపై ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు.

akhil responds on samantha health

akhil responds on samantha health

Samantha : ఏంద‌య్య చైతు..!

అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలికడగానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపింది. ఓ వైపు చికిత్స తీసుకుంటేనే మరో వైపు యశోద డబ్బింగ్‌ చెబుతున్న ఫోటోను సామ్ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ఇక సమంత తాజాగా నటించిన యశోదా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని హ‌రీష్ శంక‌ర్‌, హ‌రీష్ నారాయ‌ణ్ సంయుక్తంగా ద‌ర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, ట్రైలర్‌ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్, ఉన్నీ ముకుంద‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్లో నవంబర్‌ 11న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా మంచి విజ‌యం సాధిస్తే స‌మంత కెరియ‌ర్ ఊపందుకున్న‌ట్టే అని చెప్పాలి.

sandeep

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి