Samantha : స్టార్ హీరోయిన్ సమంత శనివారం రోజు తన ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది. వయోసైటిస్ వ్యాధితో భాదపడుతున్నట్లు సోషల్‌మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా గత కొన్ని రోజులుగా సమంత కాస్మోటిక్ సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి. ఇటీవలే ఓ యాడ్ షూట్‌లో భాగంగా రిలీజైన ఫోటోలు కూడా మార్పులు కనిపించడంతో వార్తలు మరింత ఊపందుకున్నాయి. ఈ సమయంలో సమంత తనకు వయోసైటిస్ అని ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు. సమంత పోస్ట్‌పై చిరంజీవి,జూ.ఎన్టీఆర్, రాశీఖన్నా, జాన్వీ కపూర్ ఇలా పలువురు సినీ ప్రముఖులు సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్‌లు పెడుతున్నారు.
సమంత మాజీ మరింది అక్కినేని అఖిల్ కూడా సమంత త్వరగా కోలుకోవాలని పోస్ట్ పెట్టారు. ‘అందరి ప్రేమాభిమానాలే నీకు మరింత బలాన్నిస్తాయి డియర్ సామ్’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటివరకు అక్కినేని నాగార్జున గానీ, నాగచైతన్య గానీ ఈ విషయంపై స్పందించలేదు. నాగ చైతన్య సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇంకా స్పందించలేదని, డైరెక్ట్‌గా వెళ్లి సమంతని పరామర్శిస్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి అఖిల్ ఒక్కడు మాత్రమే స్పందించడంతో నెటిజన్స్.. నాగా చైతన్య కన్నా అఖిల్ బెటర్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఈ విషయంపై ఇంకా సైలెంట్‌గానే ఉన్నారు.
అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం నిలికడగానే ఉందని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలిపింది. ఓ వైపు చికిత్స తీసుకుంటేనే మరో వైపు యశోద డబ్బింగ్ చెబుతున్న ఫోటోను సామ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇక సమంత తాజాగా నటించిన యశోదా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్, హరీష్ నారాయణ్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్‌లు, ట్రైలర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. వరలక్ష్మీ శరత్‌కుమార్, ఉన్నీ ముకుందన్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో నవంబర్ 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే సమంత కెరియర్ ఊపందుకున్నట్టే అని చెప్పాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.