Omkar : ఈటీవీలో ప్రసారమవుతున్న మెజార్టీ కార్యక్రమాలను మల్లెమాల వారు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో, క్యాష్ కార్యక్రమాలతో పాటు ఇంకా సీరియల్స్ ని కూడా మల్లెమాల నిర్మించి ఈటీవీకి అందిస్తోంది. కేవలం మల్లెమాల వారి కంటెంట్ కారణంగానే ఈటీవీ టాప్ రేటింగ్ లో ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆదరణ సొంతం చేసుకున్న జబర్దస్త్ తో పాటు ఇంకా పలు కార్యక్రమాలను మల్లెమాల వారి క్రియేటివ్ టీమ్ ఈటీవీ కి అందించడం కారణంగానే ప్రస్తుతం ఈ స్థాయిలో ఛానల్ ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ బుల్లితెర విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.
ఇక స్టార్ మా కోసం కూడా మల్లెమాల తరహాలోనే ఓంకార్ అన్నయ్య ఇచ్చే కంటెంట్ టాప్ రేటింగ్ దగ్గర చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్టార్ మా లో కామెడీ స్టార్స్ మొదలుకొని ఎన్నో కార్యక్రమాలను ఓంకార్ అన్నయ్య నిర్మించినవి టెలికాస్ట్ చేస్తున్నారు. ఆ మధ్య బిగ్ బాస్ కూడా ఓంకార్ సమర్పణలో రాబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఓంకార్ కి ఉన్న నెట్వర్క్ మరియు క్రియేటివ్ మైండ్ కారణంగా అతడి కార్యక్రమాలు మరియు గేమ్ షోస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే స్టార్ మా టాప్ రేటింగ్ ఛానల్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం నెంబర్ వన్ ఛానల్ గా స్టార్ మా నిలువగా నెంబర్ 2 జీ తెలుగు ఉంది. నెంబర్ 3 స్థానంలో ఈటీవీ ఉంది, ఇక నెంబర్ 4 స్థానంలో జెమినీ టీవీ చివరగా ఉంది.
కేవలం మల్లెమాల వారి కార్యక్రమాల కారణంగా ఈటీవీ మూడవ స్థానం దక్కించుకుంది. లేదంటే ఎక్కడ జెమిని టీవీ కింద ఈటీవీ ఉండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా ఛానల్ వారు కార్యక్రమాలను నిర్మించుకోవచ్చు కదా అనే అభిప్రాయం కొందరికి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఛానల్ వారు ఎక్కువగా కార్యక్రమాలను సీరియల్స్ ను నిర్మించుకోరు. వారు కేవలం స్లాట్ ఇస్తారు, వేరే నిర్మాతలు ఆ స్లాట్ లో టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. వచ్చే లాభం ను పంచుకుంటూ ఉంటారు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈ టీవీకి భారీ ఎత్తున లాభాలు దక్కుతూ ఉంటాయి. దానితో మల్లెమాల వారికి కూడా లాభాల వాటా ఉంటుంది. అలాగే ఓంకార్ అన్నయ్య కూడా స్టార్ మా వారు పెద్ద మొత్తంలో ప్రతి నెల నెల లాభాల్లో వాటా ఇస్తూ ఉంటారట. ఇదో ఒక పెద్ద వ్యాపారం.. ఇందులో ఎవరికి ఎంత దక్కుతుంది అనేది ఎవరికీ తెలియదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.