Akhil Sarthak : బిగ్ బాస్ షో ద్వారా అఖిల్ సార్థక్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు అతను కొన్ని సీరియల్స్‌లో నటించాడు. ఆ విషయం అఖిల్ చెప్పే వరకు కూడా ఎవ్వరూ గుర్తించలేదు. సీరియల్స్‌లో విలన్ రోల్స్ వేస్తూ అఖిల్ సార్థక్ కనిపించాడు. కానీ వాటి ద్వారా అంత ఫేమ్ రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంట్లోకి అఖిల్ వచ్చాడో.. అప్పటి నుంచి కాస్త వెలుగులోకి వచ్చాడు. బిగ్ బాస్ షో ద్వారా అఖిల్‌కు గుర్తింపు వచ్చింది. దాంతో పాటు నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ రన్నర్‌గా అఖిల్ నిలిచాడు. బిగ్ బాస్ ఓటీటీ రన్నర్‌గానూ అఖిల్ ఆగిపోయాడు. అలా బిగ్ బాస్ షో విన్నింగ్ అనేది అఖిల్‌కు అందని ద్రాక్షలానే మారిపోయింది. అఖిల్ అందరితోనూ కలవలేడు. తన మీద సెటైర్లు వేస్తే తీసుకోలేడు. ఎప్పుడూ నవ్వు మొహం కూడా కనిపించదు. అలాంటి అఖిల్‌ను ఢీ షోలోకి తీసుకున్నారు. ఆ మధ్య కొన్ని రోజులు అఖిల్ వచ్చాడు. మధ్యలో బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ రావడంతో వెళ్లిపోయాడు.
అయితే అఖిల్ మీద ఆది, ప్రదీప్ వంటి వారు రకరకాల కామెంట్లు వేస్తుంటారు. సెటైర్లతో ఆడుకుంటారు. అలా మొత్తానికి అఖిల్‌కు షోలో మాత్రం దారుణమైన కామెంట్లు పడుతుంటాయి. ఢీ షో అనేది అఖిల్‌కు ఏ రూపానా కూడా ఉపయోగపడలేదు. ఇదే విషయాన్ని అఖిల్ కూడా చెప్పుకొచ్చాడు. కానీ మళ్లీ అదే షోలోకి అఖిల్ వచ్చాడు.తాజాగా ఢీ ప్రోమో వచ్చింది. అందులో అఖిల్ కనిపించాడు. అందులో మళ్లీ అఖిల్ మీద అనవసరపు కామెంట్లు కనిపించాయి.
ఊరి పెద్దగా అఖిల్ నటిస్తే.. అతని పరువుతీసేందుకే అన్నట్టుగా ఆది పక్కనే ఉన్నాడు. ఊర్లో నా గురించి ఏం అనుకుంటున్నారు అని అఖిల్ అడిగితే.. ఎందుకు పోయాడు.. ఎందుకు వచ్చాడు? అని అనుకుంటున్నారు అని ఆది కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.