Akhil Sarthak : ఎందుకు పోయాడు? ఎందుకు వచ్చాడు?.. అఖిల్ సార్థక్‌కు ఢీ షోలో అవమానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akhil Sarthak : ఎందుకు పోయాడు? ఎందుకు వచ్చాడు?.. అఖిల్ సార్థక్‌కు ఢీ షోలో అవమానం

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,2:40 pm

Akhil Sarthak : బిగ్ బాస్ షో ద్వారా అఖిల్ సార్థక్ ఫేమస్ అయ్యాడు. అంతకు ముందు అతను కొన్ని సీరియల్స్లో నటించాడు. ఆ విషయం అఖిల్ చెప్పే వరకు కూడా ఎవ్వరూ గుర్తించలేదు. సీరియల్స్‌లో విలన్ రోల్స్ వేస్తూ అఖిల్ సార్థక్ కనిపించాడు. కానీ వాటి ద్వారా అంత ఫేమ్ రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంట్లోకి అఖిల్ వచ్చాడో.. అప్పటి నుంచి కాస్త వెలుగులోకి వచ్చాడు. బిగ్ బాస్ షో ద్వారా అఖిల్‌కు గుర్తింపు వచ్చింది. దాంతో పాటు నెగెటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. బిగ్ బాస్ నాలుగో సీజన్ రన్నర్‌గా అఖిల్ నిలిచాడు. బిగ్ బాస్ ఓటీటీ రన్నర్‌గానూ అఖిల్ ఆగిపోయాడు. అలా బిగ్ బాస్ షో విన్నింగ్ అనేది అఖిల్‌కు అందని ద్రాక్షలానే మారిపోయింది. అఖిల్ అందరితోనూ కలవలేడు. తన మీద సెటైర్లు వేస్తే తీసుకోలేడు. ఎప్పుడూ నవ్వు మొహం కూడా కనిపించదు. అలాంటి అఖిల్‌ను ఢీ షోలోకి తీసుకున్నారు. ఆ మధ్య కొన్ని రోజులు అఖిల్ వచ్చాడు. మధ్యలో బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ రావడంతో వెళ్లిపోయాడు.

Akhil Sarthak : ఢీ లోకి అఖిల్..

అయితే అఖిల్ మీద ఆది, ప్రదీప్ వంటి వారు రకరకాల కామెంట్లు వేస్తుంటారు. సెటైర్లతో ఆడుకుంటారు. అలా మొత్తానికి అఖిల్‌కు షోలో మాత్రం దారుణమైన కామెంట్లు పడుతుంటాయి. ఢీ షో అనేది అఖిల్‌కు ఏ రూపానా కూడా ఉపయోగపడలేదు. ఇదే విషయాన్ని అఖిల్ కూడా చెప్పుకొచ్చాడు. కానీ మళ్లీ అదే షోలోకి అఖిల్ వచ్చాడు.తాజాగా ఢీ ప్రోమో వచ్చింది. అందులో అఖిల్ కనిపించాడు. అందులో మళ్లీ అఖిల్ మీద అనవసరపు కామెంట్లు కనిపించాయి.

Akhil Sarthak Came Back to Dhee Show

Akhil Sarthak Came Back to Dhee Show

Akhil Sarthak : అఖిల్ మీద ఆది సెటైర్లు..

ఊరి పెద్దగా అఖిల్ నటిస్తే.. అతని పరువుతీసేందుకే అన్నట్టుగా ఆది పక్కనే ఉన్నాడు. ఊర్లో నా గురించి ఏం అనుకుంటున్నారు అని అఖిల్ అడిగితే.. ఎందుకు పోయాడు.. ఎందుకు వచ్చాడు? అని అనుకుంటున్నారు అని ఆది కౌంటర్లు వేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది