Amala : విడాకుల విషయం లో సమంత దే తప్పు అని తేల్చి పారేసిన అమల అక్కినేని .. ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amala : విడాకుల విషయం లో సమంత దే తప్పు అని తేల్చి పారేసిన అమల అక్కినేని .. !

Amala  : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత ఆ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ జీవితాంతం కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 June 2023,4:00 pm

Amala  : ‘ ఏ మాయ చేసావే ‘ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సమంత ఆ సినిమా టైంలోనే నాగచైతన్యతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్ళింది. ఇద్దరు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కానీ జీవితాంతం కలిసి ఉండలేకపోయారు. పెళ్లయిన నాలుగు సంవత్సరాలకి వీడాకులు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏమైందో తెలియదు కానీ విడాకులు తీసుకొని ఎవరి లైఫ్ వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీళ్ళ విడాకులు గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.

విడాకులు తీసుకున్న విషయం సమంత నాగచైతన్య మర్చిపోయిన నెటిజెన్లు మాత్రం అస్సలు మర్చిపోవడం లేదనిపిస్తుంది. నిత్యం సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య విడాకుల గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వీళ్ళిద్దరి విడాకులు విషయం గురించి ఓ వార్త వచ్చింది. రీసెంట్ గా అక్కినేని అమల ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో సమంత నాగచైతన్య మీద వచ్చే నెగటివ్ కామెంట్స్ పై ఆమె స్పందించారు. సెలబ్రిటీ జీవితం అన్న తర్వాత మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం సహజం. దానిని మనం మార్చలేము, సమంత మరియు నాగచైతన్య విడాకులు ఏమి సీక్రెట్ గా జరగలేదు పబ్లిక్ గానే జరిగాయి.

మరి దీని గురించి నెటిజన్స్ అభిప్రాయాలు స్వీకరించడం కూడా మన బాధ్యత. కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను నేను స్వాగతిస్తాను అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఏమైనా సుమంత నాగచైతన్య విడాకులు తీసుకొని చాలా రోజులవుతున్నప్పటికి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. వాటిపై నెటిజన్ లు వివిధ రకాలుగా స్పందిస్తూనే ఉంటున్నారు. ఇకపోతే సమంత నాగచైతన్య తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్నాడు. ఇక సమంత బాలీవుడ్లో పలు వెబ్ సిరీస్ లలో నటిస్తుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది