Samantha : లవ్ స్టోరి’ గ్రాండ్ సక్సెస్‌లో సామ్ ఎందుకు పాల్గొనలేదు

Authored By mallesh | The Telugu News | Updated on: October 20, 2021, 4:33 pm

Samantha గత కొద్ది రోజుల నుంచి అక్కినేని నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికీ అందుకు సంబంధించిన వార్తలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అసలు చై-సామ్ మధ్య విభేదాలు ఎలా ఏర్పడ్డాయి? ఎందుకు విడాకుల దాకా విషయం వచ్చిందనే విషయమై ఇండస్ట్రీ వర్గాలు, నెటిజన్లు ఏ విధంగా చర్చించుకుంటున్నారు? ‘లవ్ స్టోరి’ గ్రాండ్ సక్సెస్‌లో సామ్ ఎందుకు పాల్గొనలేదు అనే విషయాలు మీ కోసం..

akkineni family conditions samantha unacceptable divorce

akkineni family conditions samantha unacceptable divorce

Samantha మ్యారేజ్ త‌ర్వాత ఆంక్ష‌లు..

‘ఏ మాయ చేశావే’ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటించి తెరపైన జంటగా కనిపించి ప్రేక్షకులను అలరించిన సమంత-చైతన్య కొద్ది రోజుల తర్వాత రియల్ లైప్ కపుల్‌గా మారిపోయారు. ఆ సినిమా స్టార్ట్ అయిన నాటి నుంచి వీరి మధ్య ‘లవ్ స్టోరి’ రన్ అయిందని మ్యారేజ్ తర్వాత కథనాలు వచ్చాయి. అయితే, మ్యారేజ్ తర్వాత పలు అంశాలపై అక్కినేని చైతన్య ఆంక్షలు పెట్టినట్లు తెలుస్తోంది. కుటుంబ మర్యాద, అక్కినేని వారి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని హుందా క్యారెక్టర్స్ ప్లే చేయాలని సమంతకు సూచించారని, అయినా ఆమె అవేవీ పట్టించుకోలేదని చర్చ జరుగుతున్నది. ఇటీవల కాలంలో విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో వెరీ బోల్డ్ క్యారెక్టర్‌లో సామ్ కనిపించింది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp