Garikapati – Chiranjeevi : సోషల్ మీడియాలో ఇప్పటికి గరికపాటి, మెగా అభిమానుల మధ్య వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ విషయంలో గరికపాటి నరసింహారావును ఇప్పటికీ మెగాభిమానాలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఈ లిస్టులోకి అక్కినేని వాళ్లు కూడా వచ్చారు. మెగా, గరికపాటి మధ్యలోకి అక్కినేని ఫ్యాన్స్ ఎందుకు వచ్చారు అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. కాకపోతే ఈ విషయంలోకి అక్కినేని అభిమానులు రావడానికి కారణం.. ఒక పాత వీడియోలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు అయ్యుండొచ్చు. మరోవైపు గరికపాటి విషయంపై ముందు సెటైర్లు వేసిన నాగబాబు.. ఆ తర్వాత మాత్రం కూల్ అయిపోయాడు. గరికపాటి లాంటి పండితుడితో తమకు క్షమాపణ చెప్పించుకోవాలి లేదని..ఏదో ఒక బ్యాడ్ మూడ్ లో ఉండి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటాడు..
అంతేకానీ ఆయన ప్రతిభను కానీ, పాండిత్యాన్ని కానీ తక్కువ చేయాలి అనుకోవడం లేదు అంటూ నాగబాబు మళ్ళీ ట్వీట్ చేశాడు. బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలాయి బలాయ్ కార్యక్రమంలో అభిమానులతో ఫోటోలు దిగుతున్న చిరంజీవిని చూసి అసహనానికి లోనైన గరికపాటి నరసింహారావు.. వెంటనే చిరంజీవి స్టేజి మీదకి రాకపోతే తాను అక్కడ నుంచి దిగి వెళ్లిపోతాను అంటూ కాస్త విసుక్కున్నట్టు మాట్లాడాడు. ఆ వెంటనే చిరంజీవి స్టేజ్ మీదకు వచ్చి.. నేను మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను.. మీ ప్రవచనాలు చాలా అద్భుతంగా ఉంటాయి.. త్వరలోనే మిమ్మల్ని ఇంటికి ఆహ్వానించి ఆథిత్యం ఇస్తాను అని కూడా చిరంజీవి చెప్పాడు. ఆయన సంస్కారానికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అయితే మెగా అభిమానులు ఇక్కడితో ఊరుకోకుండా.. గరికపాటి మాట్లాడిన పాత వీడియో ఒకటి బయటకు తీశారు.అప్పట్లో ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న ఆయన..
నాగేశ్వరరావు సినిమాలు విడుదలైనప్పుడు పోస్టర్లపై పేడ కొట్టేవాడినని అందులో చెప్పుకొచ్చారు. అప్పట్లో తమకు ప్రధాన శత్రువు ఏఎన్నార్ అంటూ గరికపాటి చేసిన వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు హర్ట్ అవుతున్నారు. ఏదైనా విషయం ఉంటే మీరు మీరు చూసుకోండి కానీ.. మధ్యలో పాత వీడియోలు తీసి అక్కినేని కుటుంబాన్ని ఎందుకు మధ్యలోకి లాగుతున్నారు అంటూ వాళ్ళు మండి పడుతున్నారు. ఇక ఇదే అలాయ్ బలాయ్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోల మధ్య సానిహిత్యం బాగానే ఉండదని.. కానీ అభిమానుల మధ్య మాత్రం కొట్టుకునేంత ద్వేషం ఉండేదని.. అది పోగొట్టడానికి తన వంతు కృషి తను ఎప్పుడు చేస్తూనే ఉన్నానని చెప్పాడు. ఏదైనా మొత్తానికి ఇష్యూ జరుగుతున్నది చిరంజీవి, గరికపాటి మధ్య అయితే.. అనవసరంగా మధ్యలోకి అక్కినేని వాళ్లు కూడా ఎంటర్ అయ్యారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.