Akkineni Akhil Engagement : సైలెంట్‌గా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..!
Akkineni Akhil Engagement : సమంత నుండి విడిపోయిన నాగ చైతన్య త్వరలో శోభితని వివాహం చేసుకోబోతున్నాడు. డిసెంబర్ 4న వారి వివాహ తేదిగా నిర్ణయించారు. ప్రస్తుతం వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండగా, అందరు ఈ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నాగ చైతన్య, శోభితను వివాహం చేసుకోబోతుండటంతో.. నాగార్జున ఎంతో హ్యాపీగా ఉన్నారు. చైతూ-శోభితల నిశ్చితార్థానికి సంబంధించి ఫస్ట్ అధికారికంగా ప్రకటించింది కూడా కింగ్ నాగార్జునే. రెండో కుమారుడు అఖిల్ విషయంలోనూ నాగ్ ఎంతో బాధని అనుభవించారు. నిశ్చితార్థం పూర్తయిన తర్వాత అఖిల్ పెళ్లి అనూహ్యంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
Akkineni Akhil Engagement : సైలెంట్‌గా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం.. అమ్మాయి ఎవరంటే..!
అప్పటి నుండి అఖిల్ విషయంలో నాగార్జున చాలా వర్రీ అవుతున్నారు. ఇప్పుడిక ఆ వర్రీ కూడా లేదు. ఎందుకంటే, తాజాగా కింగ్ నాగార్జునే తన చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని నిశ్చితార్థం కూడా పూర్తయిందంటూ అధికారికంగా ఎక్స్ వేదికగా తెలిపారు. జైనాబ్ రావుద్జీ తో అఖిల్ అక్కినేని నిశ్చితార్థం అయినట్లుగా కింగ్ నాగార్జున ప్రకటించారు. జైనాబ్‌ని మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషం.. యువ జంటను అభినందించడానికి మాతో చేరండి. వారి ప్రేమకు, ఆనందానికి మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నానని ఎక్స్‌లో పోస్ట్ చేశారు నాగార్జున. అంతేకాదు, కాబోయే నూతన జంట ఫొటోలను కూడా ఆయన షేర్ చేశారు.పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అదే సమయంలో ‘అయ్యగారు సడెన్ గా ఇలా సర్ ప్రైజ్ ఇచ్చారేంటి’? అని సినీ ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అఖిల్ కు కాబోయే భార్య జైనాబ్ ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా అని తెలుస్తోంది. వచ్చే ఏడాది వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. ఇక శోభిత- చైతూ పెళ్లి డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్టు
తెలుస్తుంది.
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.